టీ20 ప్రపంచ కప్ హీరో, భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. భారత్ మాతా కీ జై , వీ లవ్ యూ సిరాజ్ భాయ్ నినాదాలతో మెహిదీపట్నం నుంచి ఈద్‌గహ్ గ్రౌండ్ వరకు మారు మ్రోగి పోయింది.
మెహిదీపట్నం నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్‌పై జీప్ ఓపెన్ టాప్ పై సిరాజ్ విజయోత్సవ ర్యాలీ సాగింది. ఫాన్స్ కు అభివాదం చేస్తూ సిరాజ్ ముందుకు కదిలాడు. ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్ పట్టి బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ను ఒక్క ఓటమి కూడా లేకుండా సొంతం చేసుకుంది భారత్. మెగాటోర్నీలో మొదట నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది.
కోట్లాది ప్రజల ఆశలు నిజమయ్యేలా ప్రపంచ కప్ తో ఇండియాకి వచ్చిన టీమిండియా ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు అభిమానులు. ప్రధాని మోడీ స్వయంగా కలిసి ప్రపంచ కప్ హీరోలను అభినందించారు.
Published at : 06 Jul 2024 09:01 AM (IST)
ఆట ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి