Hardik Pandya Divorce |Anant Ambani-Radhika Merchant’s sangeet ceremony |
వరల్డ్ కప్ సంచలనం హార్దిక్ పాండ్య విడాకాలు తీసుకోనున్నారా..? అంబానీ సంగీత్ వేడుకలకు సింగిల్ గా రావడం వెనకున్న అర్థం అదేనా..! కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్య, తన భార్య నటాషా కు పడట్లేదని..వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, దానిపై ఇరువురు అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ, నటాషా మాత్రం ఇన్ స్టా గ్రామ్ లో హర్దిక్ తో కలిసి దిగిన ఫొటోలు డిలీట్ చేసింది. ఐపీఎల్ మ్యాచులకు రాలేదు. మొన్న వరల్డ్ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన హర్దిక్ పై అంతా ప్రశంసలు కురిపిస్తుంటే..తను మాత్రం చిన్న పోస్ట్ కూడా వేయలేదు. ముంబయిలో జరిగిన విక్టరీ పరేడ్ కు అందరు క్రికెటర్ల భార్యలు వస్తే… నటాషా మాత్రం అక్కడి రాలేదు. దీంతో.. విడాకుల రూమర్ నిజమేనన్న బలం ఇంకా ఎక్కువైంది. కానీ,అంతేకాదు..శుక్రవారం రాత్రి జరిగిన అనంత్ అంబానీ సంగీత్ వేడుకలకు కూడా పాండ్య ఒంటరిగానే వచ్చాడు. కృణాల్ పాండ్య వైఫ్ తో వస్తే..హార్దిక్ మాత్రం ఒంటరిగానే కనిపించాడు. సో.. ఈ డాట్స్ అన్ని లింకంప్ చేసి చూస్తే..వీళ్ల విడాకులు ఖాయం అన్న ప్రచారం మరింత నమ్మెలా ఉంది.