Hardik Celebrated With His Son: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో విజయం సాధించి రోజులు గడుస్తున్న తర్వాత కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. భారత్ కు వచ్చిన ఆటగాళ్ళను ప్రధాని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలుపటం, తరువాత ముంబై(Mumbai)లో విజయోత్సవ పరేడ్‌కు భారీగా అభిమానులు తరలిరావటం కూడా తెలిసిందే. తరువాత జట్టులోని ఆటగాళ్లు వారి కుటుంబాల వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు వారికి వచ్చిన ఆత్మీయ ఆహ్వానం ఫోటోలు షేర్ చేస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో హార్దిక్ పాండ్యా(Hardic Pandya) షేర్ చేసిన ఫోటోలు మరోసారి అందరినీ ఆకర్షించాయి. ఎందుకంటే హార్దిక్ తన కొడుకుతో మాత్రమే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. పాండ్యా పంచుకున్న ఫోటోలో భార్య నటాషా స్టాంకోవిచ్ ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్దలు ఉన్న విషయంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ విడిపోబోతున్నారని… వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీ 20 ప్రపంచకప్ గెలిచి పాండ్యా చేసుకున్న సంబరాల్లో సతీమణి నటాషా కనిపించకపోవడంతో మళ్లీ పుకార్లు చెలరేగాయి.
My #1! Everything I do, I do for you ❤️❤️❤️ pic.twitter.com/g7KUzKgbAz
— hardik pandya (@hardikpandya7) July 5, 2024
నటాషా ఎక్కడ..?
నేను ఏంచేసినా అది నీ కోసమే చేస్తానంటూ హార్దిక్ పాండ్యా తన కొడుకును ఉద్దేశించి పోస్ట్ చేసిన ఫోటోల్లో ఎక్కడా అతని భార్య నటాసా స్టాంకోవిక్ కనిపించలేదు. అయితే కొడుకుతో కలిసి హార్దిక్ పాండ్యా ఫొటోలను ఎవరు తీశారన్నది ఇంకా తెలవలేదు. కానీ పాండ్యా పోస్ట్ చేసిన అన్ని ఫొటోల్లో నటాషా ఒక్క ఫొటోలో కూడా కనిపించలేదు. ఈ పోస్ట్ తర్వాత నటాసా-హార్దిక్ విడిపోయారనే పుకార్లు సోషల్ మీడియాలో మళ్లీ స్టార్ట్ అయ్యాయి. అయితే కొన్నేళ్ల నుంచి వీరి విడిపోయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని… నటషా హార్దిక్‌తో విడిపోయేందుకు భారీ భరణం కూడా డిమాండ్ చేస్తోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల నటషా పోస్ట్ వైరల్
అయితే టీమిండియా టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత నటాషా చేసిన పోస్ట్ వైరల్ అయింది. జీవితంలో కొన్ని సమయాల్లో మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుందని… ఆ సమయంలో చాలా నిరుత్సాహ పడతామని ఆమె ఓ పోస్ట్ చేశారు. ఒంటరిగా ఉంటున్నామని బాధ పడవద్దని…. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడని వేదాంత ధోరణిలో నటాషా పోస్ట్ చేశారు. మనకేం కావాలో దేవుడికి తెలుసని అన్ని ఆయనే చూసుకుంటాడని నటాషా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో మరోసారి పాండ్యాతో న।టషా విడిపోయిందనే రూమర్స్ చెలరేగాయి.
టీ 20 ప్రపంచ కప్‌లో పార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. 8 మ్యాచ్‌ల్లో 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
మరిన్ని చూడండి