Sports

MS Dhoni Birthday Salman Khan attends mid night cake cutting ceremony Watch Video | MS Dhoni Birthday: ధోనీ బర్త్ డే వేడుకలో సల్మాన్ సందడి


Salman Khan celebrates MS Dhonis birthday: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43వ బర్త్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సన్నిహితుల సమక్షంలో ధోనీ కేక్ కట్ చేసి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాల్గొని సందడి చేశారు. స్వయంగా కేక్ కట్ చేసి ధోనికి తినిపించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ధోనీ బర్త్ డే వేడుకలో సల్మాన్ ఖాన్ సందడి

ఫ్రెండ్స్ సమక్షంలో ధోనీ కేక్ కట్ చేసి తన బర్త్ డే చేసుకున్నాడు. తొలుత కేక్ కట్ చేసి తన భార్య సాక్షి ధోనికి తినిపించాడు. ఈ సందర్భంగా సాక్షి సరదాగా భర్త కాళ్లకు నమస్కరించింది. ధోని ఆమెను ఆశీర్వదించాడు. ఆ తర్వాత ధోనీ… సల్మాన్ కు కేక్ తిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను సల్మాన్ తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోకు ‘హ్యాపీ బర్త్ డే కప్టాన్ సాబ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వేడుకలో సల్మాన్ తనకు ఇష్టమైన అలీవ్ గ్రీన్ జీన్స్, బ్లాక్ షర్ట్ వేసుకుని పాల్గొన్నారు. అటు సాక్షి కూడా తన ఇన్ స్టా వేదికగా ధోని బర్త్ డే వేడుకకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ధోనీ బర్త్ డే ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకే ఫ్రేమ్ లో సల్మాన్, ధోనీని చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫేవరెట్ క్రికెటర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.


అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో పాల్గొన్న సల్మాన్, ధోనీ

అంతకు ముందు సల్మాన్ ఖాన్ తో పాటు ధోనీ దంపతులు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. సంగీత్ వేడుకలో పాల్గొని సరదాగా గడిపారు. ఈ వేడుకలో పలువురు సినీ తారలతో పాటు క్రికెటర్లు, క్రికెటర్లు సహా పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత్ వేడుకలు ముగిశాక, అక్కడి నుంచి నేరుగా ధోనీ ఇంటికి వచ్చారు. సల్మాన్, ధోని చేత కేక్ కట్ చేయించి బర్త్ డే వేడుక జరిపారు. అనంతరం అక్కడి సల్లూ భాయ్ నుంచి వెళ్లిపోయారు.


‘సికిందర్’ సినిమా షూటింగ్ లో సల్మాన్ బిజీ

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన చివరి సారిగా ‘టైగర్ 3’ చిత్రంలో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘సికిందర్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2025 ఈద్ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది.  

Read Also: సమంతను క్షమాపణలు కోరిన డాక్టర్‌ లివర్‌ డాక్‌ – కానీ, ఆమె వైద్యుడిపై సంచలన ఆరోపణలు.. 

మరిన్ని చూడండి





Source link

Related posts

Gautam Gambhir Finally Breaks Silence On India Coach Job

Oknews

కమల్ హాసన్ పనికిరాడురా అయ్యా..మీ యాక్టింగ్ తగలెయ్యా

Oknews

Shreyas Iyer Flops On Domestic Cricket Return Amid BCCI Contract Row

Oknews

Leave a Comment