శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్రరెడ్డి, హెచ్.గోపాల్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఫైనాన్స్) రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొంటారని, ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి ఎం. జానకి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా పాల్గొంటారని జాబితా విడుదల చేశారు. అయితే వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్ప అందరూ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆహ్వానించలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే సమావేశానికి ముందే సమావేశంలో పాల్గొనే వారి జాబితా విడుదల చేశారు. అందులో పవన్ కల్యాణ్ పేరు కూడా ఉంది. అయితే మరెందుకు పవన్ కల్యాణ్ హాజరు కాలేదు? అందుకు రెండు కారణాలు ఉన్నాయంటున్నారు.