EntertainmentLatest News

ప్రభాస్ పై మహేష్ బాబు అధికార వ్యాఖ్యలు 


సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)తెలుగు సినిమాకి హాలీవుడ్ ఛాయల్ని తీసుకొచ్చే హీరో. తన అందంతో, పెర్ఫార్మెన్స్ తో  సిల్వర్ స్క్రీన్ కి ఆ ఎట్మాస్ఫియార్ ని కలిగేలా చేస్తాడు. ఈ మాట నిజమని మహేష్ అభిమానే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడు ఒప్పుకుంటాడు. రీసెంట్ గా ఆయన ప్రభాస్ గురించి, కల్కి(kalki2898 ad)గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు.ఇప్పుడు అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

కల్కి ని ఇటీవలే మహేష్ బాబు వీక్షించాడు. ఇక వెంటనే తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా తెలియయచేసాడు. కల్కి ని చూసి  నా మైండ్ బ్లో అయ్యింది. అది మాటల్లో చెప్పలేను. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ (nag ashwin)ఫ్యూచరిస్టిక్ విజన్ కి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. అమితాబ్ బచ్చన్ గారి మహోన్నత స్క్రీన్ ప్రెజెన్స్ సాటి లేనిది. అలాగే  కమల్ హాసన్  గారు  పోషించే ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉండటానికి కారణం కూడా కమల్ గారే అని చెప్పాడు. ఇక ముఖ్యంగా  ప్రభాస్(prabhas)ని అయితే ఆకాశానికి ఎత్తేసాడు.  మీరు మరో గొప్ప చిత్రాన్ని చాలా సులభంగా చేసాడని చెప్పాడు. అదే విధంగా  దీపికా పదుకునే చాలా  అద్బుతంగా నటించిందని చెప్పడమే కాకుండా నిర్మాణ సంస్థ  వైజయంతి మూవీస్ కి చిత్ర యూనిట్ కి తన  అభినందనలు చెప్పాడు.  మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల  కల్కి టీమ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

ఇక మహేష్ బాబు చేసిన  పోస్ట్ వైరల్ అవ్వడానికి  కారణం కూడా ఉంది. మహేష్ ఒక వెరీ వెరీ బిగ్ స్టార్. అలాంటిది ఇంకో బిగ్ స్టార్ ని పొగిడాడు. పైగా మహేష్ ఇలా బహిరంగంగా అభినందించడం చాలా అరుదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తమ హీరో మంచి తనం గురించి పొగుడుతున్నారు. ఇక మహేష్ ఇటీవలే గుంటూరు కారంతో తన సత్తా చాటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి మూవీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జట్ తో ఆ చిత్రం తెరకెక్కబోతుంది. 

 

     



Source link

Related posts

‘ది బర్త్ డే బాయ్’ మూవీ రివ్యూ

Oknews

Congress in TS.. The survey is telling the truth..! TS కాంగ్రెస్.. సర్వే చెబుతున్న సత్యం!

Oknews

ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్‌ సాధించిన ‘గామి’!

Oknews

Leave a Comment