Andhra Pradesh

ఇసుక ట‌న్ను రూ.1225, రూ.1394 అంటూ బ్యాన‌ర్లు- ఇదేం ఉచిత ఇసుక విధానమని ప్రతిపక్షాల సెటైర్లు-ap free sand policy opposition parties satires on rates higher than earlier ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అయితే ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది. అలాగే ప్రభుత్వానికి సీన‌రైజ్ ట‌న్నుకు రూ.88 త‌ప్ప మ‌రేది అవ‌స‌రం లేద‌ని చెబుతుంది. అలాంట‌ప్పుడు ర‌వాణా ఛార్జీకి ఇంత అధిక మొత్తంలో వ‌సూలు చేస్తున్నార‌ని విమ‌ర్శలు వ‌స్తున్నాయి. గ‌త ప్రభుత్వానికి ఇసుక వ‌ల్ల ఏటా రూ.780 కోట్లు వ‌చ్చేవి. కానీ ఈ ప్రభుత్వానికి రూపాయి కూడా అవ‌స‌రం లేద‌ని చెబుతుంది. ప్రజ‌ల నుంచి వ‌సూలు చేసే ఈ మొత్తం డ‌బ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నలు వ‌స్తున్నాయి. ఇప్పుడు వ‌ర‌ద నీరు రావ‌డంతో రీచ్‌ల వ‌ద్ద ఇసుక త‌వ్వకాలు లేకుండా, కేవ‌లం స్టాక్ పాయింట్ల వ‌ద్ద ఉన్న 49 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌ ఇసుక‌నే అమ్ముతున్నారు. అలాంట‌ప్పుడు ఇప్పుడే ఇంత ధ‌ర ఉంటే, సెప్టెంబ‌ర్ త‌రువాత‌ వ‌ర‌ద‌లు త‌గ్గి, ఇసుక రీచ్‌ల వ‌ద్ద ఇసుక త‌వ్వకాలు నిర్వహిస్తే అప్పుడు ఇసుక ధ‌ర మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో ఇళ్లు నిర్మాణాలు చేప‌ట్టే వారిపైన‌, భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌పై మ‌ళ్లీ ఇసుక ధ‌ర ప్రభావం ప‌డుతుందని అంటున్నారు.



Source link

Related posts

నా మద్దతు కావాలంటే కప్పం కట్టాల్సిందే.. ఇంచార్జికి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే-the sitting mla demanded the in charge to pay money for his support ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Kalyan: వారాహి విజయ దీక్ష చేపట్టిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.. జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ

Oknews

CM Revanth Reddy : కడపలో ఉపఎన్నిక వస్తే షర్మిల విజయం కోసం గల్లీ గల్లీ ప్రచారం చేస్తా

Oknews

Leave a Comment