దిశ, ఫీచర్స్ : ఆరోగ్యానికి జామ పండు చాలా మంచిది. అందుకే దీనిని చా మంది ఇష్టంగా తింటారు. ఇక ఇవి చాలా విరివిగా దొరకుతాయి.అందుకే కొంత మంది వీటిని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే చాలా మందికి జామ పండు వలన కలిగే ప్రయోజనాలు తెలియవు. కాగా, దాని గురించే ఇప్పుడు తెలిసుకుందాం.
జామ పండులో శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడే విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి.అంతే కాకుండా కేలరీలు తక్కువగా ఉండి ఫైబర అధికంగా ఉండటం వలన దీనిని తినడం వలన శరీరానికి మేలు జరుగుతుంది.అందుకే వైద్యులు, మలబద్ధకంతో బాధపడే వారిని, మధుమేహ వ్యాధిగ్రస్తులను ఎక్కువగా జామపండు తినమని సూచిస్తారు.
ఎందుకంటే జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటమే కాకాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వలన మధుమేహ వ్యాధుగ్రస్తులకు ఇది చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్ సి,బి3, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇది మీ మెదడులో రక్త ప్రసరణకు సహాయపడి, ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొంత మంది మాత్రం వర్షాకాలంలో అస్సలే జామకాయ తినకూడదు, దీని వలన కఫం తయారవ్వడమే కాకుండా, జలుబు కూడా చేస్తుంది అని చెబుతుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామ రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంతే కాకుండా జలుబుతో బాధపడే వారు జామకాయను తీసుకొని అందులో గింజలు తీసి గ్లాస్ వాటర్ తాగితే జలుబు తగ్గడమే కాకుండా గొంతు, ఊపిరితిత్తుల్లో కఫం కూడా తగ్గిపోతుందంట.
నోట్ : పై వార్తను దిశ ధృవీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ఆధారం, వివిధ నిపుణులు, వైద్యులు పేర్కొన్న సూచనల మేరకు మాత్రమే ఇవ్వబడింది.