Health Care

సమంత హెల్త్ టిప్ నిజంగానే ప్రాణాలు తీస్తుందా? దీని గురించిన వివరాలు ఇవే!


దిశ, ఫీచర్స్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య ఓ డాక్టర్ సమంతను జైల్లో పెట్టాలంటూ సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ట్యాబ్లెట్స్‌తో పని లేకుండా నెబ్యులైజర్‌తో హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంలో కలుపుకొని ముక్కుతో ఆవిరిని పీలచ్చడం వలన ఇన్ఫెక్షన్స్ మాయమం అవుతాయని తెలిపింది. దీంతో ఆమె పోస్టుపై స్పందించిన డాక్టర్ నటి సమంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఆమె చెప్పిన టిప్స్ ఫాలో అవుతే చనిపోయే ప్రమాదం ఉందని, సామ్‌ను జైలులో పెట్టాలి అంటూ సంచలన పోస్టు చేశారు. కాగా, అసలు హైడ్రోజన్ పెరాక్తైడ్‌తో నెబ్యులైజ్ చేయడం అంటే ఏంటీ దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఎక్కువగా మౌత్ వాష్, క్లీనింగ్, ప్లోర్ క్లీనింగ్స్‌కు ఉపయోగిస్తారంట. దీని వలన పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదంట. కానీ దీనిని ప్రజలు నెబ్యులైజర్ ద్వారా పీల్చితే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు ధరిచేరే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, నెబ్యులైజర్‌లో ఈ రసాయనాన్ని పీల్చాలి అనుకుంటే డాక్టర్ సంరక్షణలో వారు సూచించినంత మాత్రమే పీల్చాలంట. దీనిని 10 శాతం కంటే ఎక్కువగా పీల్చడం వలన వాంతులు, తల తిరగడం, గొంత సమస్యలు వస్తాయంట. అంతే కాకుండా ఊపిరితిత్తుల పని తీరుపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు, కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పుకూడా రావచ్చునంట. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.



Source link

Related posts

చాక్లెట్ తినడం వల్ల గుండెపోటు, క్యాన్సర్‌లను చెక్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Oknews

NCERT 12వ తరగతి చరిత్రలో ‘హరప్పా నాగరికత’ అధ్యాయంలో పెద్ద మార్పు..

Oknews

మీకు ఇది తెలుసా.. ఏం చేయకుండా ఉండడం కూడా ఓ ఆర్ట్ అంట!

Oknews

Leave a Comment