Health Care

ఐదు వేల మందికి రొమ్ము పాలు ఇచ్చి కాపాడిన తల్లి..


దిశ, ఫీచర్స్: రాజస్థాన్ బిల్వారాకు చెందిన రక్ష జైన్ ఒక ఎలక్ట్రో థెరపిస్ట్. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన ఆమె.. తన రొమ్ము పాలతో ఐదు వేల మంది చిన్నారులకు లైఫ్ సపోర్ట్ ఇచ్చింది. పుట్టిన వెంటనే తల్లి పాలు పొందలేని నవజాత శిశువులకు అమ్మగా మారింది. నిస్వార్థ ప్రేమ, సేవకుగాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఇంతకీ ఆమె ఇలాంటి సర్వీస్ ఎందుకు చేస్తుంది? ఎలాంటి పరిస్థితులు ఇందుకు దారితీశాయి? తెలుసుకుందాం.

2018లో కొడుకుకు జన్మనిచ్చిన రక్ష… తనకు సరిగ్గా పాలు లేకపోవడంతో స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ హాస్పిటల్ లోని ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంక్ సహాయం పొందింది. తను తీసుకున్న హెల్ప్ ను ఇన్ స్పిరేషన్ గా చేసుకుని… ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. 2018 నుంచి ఇప్పటి వరకు 160.81 లీటర్ల పాలను మిల్క్ బ్యాంక్ కు ఇచ్చింది. తద్వారా ఐదు వేలకు పైగా పిల్లలకు పాలు ఇవ్వగలిగింది. ఆమెకు 2023లో సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు కూడా ఈ సేవలను ఆపలేదు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి రోజూ మిల్క్ బ్యాంక్ కు వెళ్లి పాలు ఇచ్చింది. ఈ సర్వీస్ మరింత ఎక్సపాండ్ చేద్దామనుకున్న రక్ష… లైఫ్ వెల్ఫేర్ సొసైటీ పింక్ స్క్వాడ్ ను ఫామ్ చేసింది.



Source link

Related posts

బిస్కెట్‌ను తెలుగులో ఏమంటారో తెలుసా?

Oknews

ఈ అనారోగ్య సమస్యలున్న వారు ఆ కూరగాయను తినకూడదు.. ఎందుకంటే..?

Oknews

బీఅలర్ట్: ప్రాణాలు తీస్తోన్న సిరప్.. విషపూరిత పదార్థాలున్నట్లు వెల్లడించిన CDSCO

Oknews

Leave a Comment