దిశ, ఫీచర్స్ : కీటకాలను చూస్తే చాలా మందికి నచ్చదు. అంతే కాకుండా వాటిని మనం తక్కువ చేసి చూస్తాం.. ఇంకొంత మంది అయితే పురుగు కనిపిస్తే చాలు దాన్ని తొక్కిపారేయడం లేదా, చంపడం లాంటివి చేస్తారు. అసలు పురుగులను ఇంట్లోకి రానివ్వను కూడా రానివ్వరు కానీ, ఓ పురుగును మాత్రం లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారంట కొందరు. ఏంటీ పురుగును కొనుగోలు చేయడం, అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు దానిగురించి తెలుసుకుందాం.
చాలా మంది డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలని చూసే కీటకం పేరు స్టాగ్ బీటిల్. దీని ధర ఏకంగా రూ.75 లక్షలపైనే ఉంటుందంట. ఎందుకంటే ఈ పురుగు అదృష్టానికి సంకేతం అని చాలా మంది నమ్ముతారంట, దీనిని కొనుగోలు చేసినవారు తప్పకుండా ధనవంతులు అవుతారని, ఇది కొనడం చాలా గొప్పతనంగా ఫీల్ అవుతారంట. అందుకే దీని ధర ఎంత ఉన్నా సరే, డబ్బును లెక్క చేయకుండా దీనిని కొనుగోలు చేస్తారంట.
ఇక దీనిగురించి మరిన్ని విషయాలు తెలుసుకుందా :
స్టాంగ్ బీటిల్ కీటకం అటవీ పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన సాప్రోక్సిలిక్ కూర్పును సూచించే ఓ క్రిమి.ఇది జింక కొమ్ములను పోలీ ఢిఫరెంట్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఇది 2నుంచి ఆరు గ్రాముల బరువు ఉంటాయంట. ఇవి దాదాపు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జీవిస్తాయంట. అంతే కాకుండా , లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం, ఆడ స్టాగ్ బీటిల్ 35 నుంచి 75 మి. మీ పొడవు, ఆడ స్టాంగ్ బీటిల్ 30 నుంచి 50 మి.మీ పొడవు ఉంటాయి. ఈ పురుగులను ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారంట. ఇక సైంటిఫిక్ డేటా జర్నల్ ప్రకారం ఈ పురుగులు పెద్ద దవడలు, ధైర్యానికి ప్రసిద్ధి చెందినవి