కొన్ని సంఘటనలు చూసినా విన్నా తీగ లాగితే డొంక కదిలిందనే సామెత కి ఉన్న స్టామినా గుర్తుకొస్తుంది. తాజాగా హీరోయిన్ సంజన గల్రాని(sanjana galrani) విషయంలో ఇదే జరిగింది. కాకపోతే ఈ విషయాన్నీ తనే చెప్పిందనుకోండి. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.
ప్రభాస్(prabhas)హీరోగా వచ్చిన బుజ్జి గాడు మేడిన్ చెన్నై ద్వారా తెలుగు ప్రేక్షకులకి సంజన పరిచయమే. మెయిన్ హీరోయిన్ గా త్రిష ఉన్నా కూడా సంజన పెర్ఫార్మెన్స్ కి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత కన్నడంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఈ మధ్య రేణుక స్వామి(renuka swami)హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్(darshan)కి మద్దతుగా మాట్లాడింది. దర్శన్ చాలా మంచి వాడని. ఎవరకి హాని చెయ్యడని, అలాంటి వ్యక్తి హత్య చేయించి ఉండడని చెప్పింది. ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు రేణుక స్వామి అసభ్య కరమైన మెసేజెస్ చెయ్యడం వల్లనే అది హత్య దాకా వెళ్ళింది. గతంలో నాకు కూడా అలాంటి మెసేజెస్ వచ్చాయి. ఒక విఐపి కొడుకు అర్ధరాత్రి అసభ్య కరమైన రీతిలో మెసేజెస్ పంపేవాడు.ఈ విషయాన్ని నా భర్తకి చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాం. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు. కాకపోతే ఆ తర్వాత నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక ఆ కేసుని క్లోజ్ చేసారని చెప్పుకొచ్చింది.
ఇక రేణుక స్వామి కుటుంబానికి న్యాయం జరగాలని, ఆయన భార్యకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పింది. అదే విధంగా దర్శన్ త్వరలోనే జైలు నుంచి బయటకి వచ్చి సినిమాలు చేస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సంజన ,దర్శన్ కలిసి అర్జున్ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. 2021 లో అజిజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రముఖ హీరో అది పినిశెట్టి సంజన చెల్లెలని వివాహమాడాడు. ఆమె పేరు నిక్కీ గల్రాని. నిక్కీ కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో చేసింది.