దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఒప్పుడు ఇంటి పక్కవారు అందరూ ఒక చోట కూర్చొని ముచ్చటించే వారు, పిల్లలు అందరూ ఒక చోట చేరి ఆడుకునేవారు. కానీ ప్రస్తుతం ఆరోజులు పోయాయి, చేతిలో స్మార్ట్ ఫోన్, గోడకు స్మార్ట్ టీవీ రావడంతో ఇంట్లో నుంచి బయటకు రావడమే కష్టంగా మారిపోయింది. పక్కవారు చనిపోయినా తెలుసుకోని పరిస్థితుల్లో ఉన్నారు కొందరు. ఇక స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ చేతిలో ఫోన్ పట్టుకొని వీడియోస్ చూస్తూ గడుపుతున్నారు. చాలా మంది ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోస్ చూడటానికి ఎక్కు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న క్రమంలో చాలా మందిలో ఏదో తెలియని సంతోషం కలుగుతుందంట. వారు వారికి తెలియకుండానే చాలా ఆనందంగా కనిపిస్తుంటారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు విషయంలోకి వెళ్లితే.. యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. వీరు బ్రిటన్, అమెరికాకు చెందిన 1080 మందనిని మూడు అధ్యయనాలలో పారాసోషల్ సంబందాలపై వారి అభిప్రాయం ఏంటని అడగ్గా, ఇందులో 52 శాతం బంది పారాసోషల్ సంబంధాలు ఉన్నాయంటే, 36 శాతం మంది మాత్రం తాము ఇరుగుపొరుగు వారితో మాట్లాడటం కంటే యూట్యూబ్‌లో వీడియోలు చూడటం వల్లనే ఎక్కు సంతోషం పొందుతున్నట్లు తెలపుతున్నారు.(పారా సోషల్ సంబంధం అంటే సెలబ్రిటీ, అభిమానికి మధ్య ఉన్న సంబంధం లాంటిది, వారిని నేరుగా చూడలేం, మాట్లాడలేం, కానీ వారితో ఏదో అనుబంధం ఉన్నట్లుగా ఫీల్ అవుతాం.దీనినే పారాసోషల్ సంబంధం అంటారు)
తమకు తెలియని వ్యక్తి వీడియోస్ చూసిన ఏదో అనుభూతి పొందడం, తనకు ఇష్టమై సెలబ్రిటీని చూడటం వలన ఎంతో ధైర్యంగా వారు ఉన్నట్లు అధ్యయనంలో తేలిందంట, అందుకే యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తే ఏదో తెలియని ఆనందం, సంతోషం వస్తుందంట. కొందరు మాట్లాడుతూ.. కొంత మంది మనం మనకు తెలిసిన వారితో మాట్లాడటం వాదించడం లాంటివి చేస్తే వారు మనల్ని ఏదో ఒక విధంగా కామెంట్ చేస్తారు. అలాగే కొద్ది సేపు మాట్లాడి వెళ్లిపోతారు. కానీ యూట్యూబ్‌లో వారిని మనం ఎంత సేపు అయినా చూడొచ్చు. వారు మాట్లాడుతుంటే మనం మన స్నేహితులతో ఉన్నామా అనే భావనే వస్తుంటుంది, నేను వారిని నా చేతితో తాకక పోవచ్చు కానీ వారు మనకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుందని వారు తెలిపారంట.