Health Care

సోషల్ మీడియాతో ఎక్కువ సంతోషం.. యువతలో ఆ ఫీలింగ్స్!


దిశ, ఫీచర్స్ : కొందరు తమ స్నేహితులు, సెలబ్రిటీలు, నచ్చిన వ్యక్తులతో ప్రత్యక్షంగా కలువడం, మాట్లాడటం కంటే కూడా.. వారిని సోషల్ మీడియాలో ఫాలో అవడంవల్ల ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో నచ్చిన సెలబ్రిటీ వీడియోలను చూడటం ప్రజల్లో ఉత్సాహం కలిగిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

స్టడీలో భాగంగా వీరు అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన మొత్తం 1,080 మందిని రీసెర్చర్స్ ప్రశ్నించగా, వారిలో పలువురు సోషల్ మీడియా కారణంగా ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని, ‘పారా సోషల్’ సంబంధాలే ఇందుకు కారణమని గుర్తించారు. అలాగే నిపుణుల ద్వారా ప్రశ్నించబడిన వారిలో 52 శాతం మంది తమకు స్ట్రాంగ్ పారాసోషల్ సంధాలు ఉన్నాయని చెప్పగా, మరో 36 శాతం మంది తమకు ఇష్టమైన యూట్యూబర్‌తో లేదా కంటెంట్ క్రియేటర్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు అనిపిస్తుందని, అందుకే వారిని అనుసరించకుండా ఉండలేకపోతున్నామని వెల్లడించారట. అయితే ఇవన్నీ ఆన్‌లైన్‌ వేదికగానే జరిగిపోతుంటాయి.

పారా సోషల్ సంబంధం అంటే?

నిజానికి పారా సోషల్ రిలేషన్ అనే పదాన్ని మనం తరచుగా వినియోగించం. బట్ ఇదొక సైకలాజికల్ పరిభాషగా నిపుణులు చెప్తున్నారు. తాము ఎల్లప్పుడూ నేరుగా కలిసే అవకాశం లేని, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యే చాన్స్‌లేని వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్, లవ్, ఎఫైర్, అభిమానం.. ఇలా ఏదో ఒక సంబంధం ఉన్నట్లు భావించి ఊహల్లో విహరించడం లేదా మనసులో భావించడాన్నే నిపుణులు పారా సోషల్ సంబంధాలుగా పేర్కొంటున్నారు. క్లారిటీగా చెప్పాలంటే.. నచ్చిన ఓ సెలబ్రిటీ, అభిమానికి మధ్య ఉండే సంబంధం. ఒకవేళ ఇది వ్యసనంగా మారితే ఇబ్బందులు ఎదురు కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సురక్షితమైన వేదిక!

సోషల్ మీడియా వేదికల్లో సెలబ్రిటీలను చూడటంవల్ల సంతోషమే కాదు, తమలో ధైర్యం, ఆత్మస్థైర్యం ఉన్నట్లు కూడా పలువురు భావిస్తున్నారని ఇంగ్లాండ్‌లోని కోల్చెస్టర్‌కు చెందిన మానసిక నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి తనకు నచ్చిన సెలబ్రిటీని ప్రత్యక్షంగా చూడకపోవచ్చు. ఆ వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు. పైగా అలా చేసే ప్రయత్నంలో అవతలి వ్యక్తి తిరస్కరించవచ్చు. బిజీగా ఉన్నామని వెళ్లిపోవచ్చు. అయితే ఈచర్యలవల్ల సెలబ్రిటీని అభిమానించే అభిమాని లేదా ‘పారాసోషల్’ భావనలో ఉన్న వ్యక్తి ఫీలవ్వడం, తీవ్రంగా హర్ట్ అవ్వడం వంటివి కూడా జరుగుతుంటాయి. కానీ అదే సెలబ్రిటీని యూట్యూబ్‌లోనో, వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లోనో చూసినప్పుడు అలాంటి చాన్స్ ఉండదని నిపుణులు అంటున్నారు.

తిరస్కరిస్తారనే భయం ఉండదు

అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన సెలబ్రిటీని ఇష్టమొచ్చిన యాంగిల్ జూమ్ చేసి చూడటం, మానసికంగా ఆనందించడం వంటివి చాలామంది చేస్తుంటారు. ఈ సందర్భంగా తమను ఎవరో చూస్తారని, లేకపోతే అవతలి వ్యక్తిని మరో ఉద్దేశంతో చూసినందుకు తమను తిరస్కరిస్తారనే భయం, ఆందోళన వంటివి ఉండవు. కాబట్టి సోషల్ మీడియా సెలబ్రిటీలను, నచ్చిన వ్యక్తులను ఫాలో అవడానికి మొగ్గు చూపడమే కాకుండా తమకు సురక్షితమైన వేదిగా చాలామంది భావిస్తున్నారు. ఇదంతా పర్సనల్ కోణానికి సంబంధించింది. అయితే సోషల్ యాంగిల్లో కూడా ఇన్ఫర్మేషన్ పొందడం, నాలెడ్జ్ పెంచుకోవడం వంటి లాభాలు ఉంటాయి.

చూడటమే తప్ప కామెంట్లు చేయరు

తమకు నచ్చిన అంశంతో, తాము రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ఓ యూట్యూబర్ లేదా మరో ఇన్‌ఫ్లయెన్సర్ ఎవరైనా కానీ.. సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టగానే సాధారణంగా ఏం చేస్తారు? దానిని చూడటంతోపాటు కొందరు కామెంట్లు కూడా చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలా చేసే కామెంట్లు వివాదా స్పదం కావచ్చు. లేకపోతే అవతలి వ్యక్తి, అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టిన వీడియో లేదా కంటెంట్ అయినా వివాదాస్పదమై ఉండవచ్చు. కానీ ‘పారా సోషల్’ భావనలో ఇరువైపుల వ్యక్తులకు ఇక్కడ పెద్ద ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వారిలో ఇదొక పిచ్చి అభిమానం, ఆరాధన, ఆసక్తి వంటి భావలు కలిగి ఉంటారు. ఈ పరిస్థితిలో ఉన్నవారు తమ సెలబ్రిటీల వీడియోలను చూస్తారు తప్ప కామెంట్లు పెట్టరు. ఏ సందర్భంలోనూ నెగెటివ్‌గా గానీ, పాజిటివ్‌గా గానీ రియాక్ట్ అవ్వరు.

బీ కేర్ ఫుల్ !

మనసు బాగాలేనప్పుడు సాధారణంగా అయితే కాసేపు బయటకు వెళ్లొద్దామా?, కాఫీ తాగుదామా? అని అడిగే అవకాశం ఫేస్ టు ఫేస్ సంబంధాల్లో ఉంటుంది. కానీ పారా సోషల్ సంబంధాల్లో అలా ఉండదు. కానీ ఇక్కడ ఇన్ ఫ్లుయెన్సర్లకు, ఫాలోవర్లకు మధ్య పరస్పర గౌరవం, అభిమానం, ప్రేమ ఉంటాయి. కొన్నిసార్లు అవతలివారు సెలబ్రిటీ అయినప్పుడో లేదా మనసుకు నచ్చిన వ్యక్తి అయినప్పుడో ఆ వ్యక్తితో ప్రేమలో పడొచ్చు లేదా స్థాయికి మించిన పిచ్చ అభిమానం పెంచుకోవచ్చు. లేకపోతే అవతలి వ్యక్తిని మరో యాంగిల్లో ఊహించుకోవచ్చు. కానీ ఇదంతా ఒక వ్యక్తి మానసిక భావనలో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయించడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రమాదకర వ్యక్తి అయినప్పుడు, సామాజిక వ్యతిరేక కంటెంట్‌ను క్రియేట్ చేసినప్పుడు మాత్రం పారా సోషల్ సంబంధాలు ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Related posts

నక్షత్రాలను మింగేస్తున్న కాల రంధ్రాలు.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది?

Oknews

ఇలా టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది!

Oknews

బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా.. ఈ డ్రింక్స్ ట్రై చేయండి..

Oknews

Leave a Comment