EntertainmentLatest News

షాకింగ్.. రోడ్డు ప్రమాదంలో సోహైల్ మృతి…


మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్, బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్ (Mohd Sohail) కన్నుమూశాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సోహైల్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా తుదిశ్వాస విడిచాడు. అతని వయసు కేవలం 23 సంవత్సరాలు.

సిద్ధిపేటకి చెందిన సోహైల్ చిన్న వయసులోనే ప్రముఖ బాడీ బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌ లను గెలుచుకున్నాడు. అంతేకాదు, ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా చిన్న వయసులోనే ఎంతో సాధించిన సోహైల్.. ఊహించని విధంగా రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. సిద్ధిపేట నుంచి తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలోలో తీవ్రంగా గాయపడిన సోహైల్‌ ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోహైల్ కన్నుమూశాడు. 23 ఏళ్లకే ఎంతో సాధించిన సోహైల్.. ఇలా హఠాత్తుగా మరణించడంతో సిద్ధిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Source link

Related posts

YCP vs TDP వైసీపీ-టీడీపీ మధ్య యుద్ధం!

Oknews

Sreeleela film career in danger zone శ్రీలీల మీద అందరూ పగబట్టేశారు

Oknews

అగస్ట్ 15 న  పదిహేను సినిమాలు  విడుదల 

Oknews

Leave a Comment