EntertainmentLatest News

రాజ్ తరుణ్ కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది 


మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ కేసు పెడతారో పెట్టుకోండి. కానీ నన్ను మాత్రం విడుదల చెయ్యండి. మా వాళ్ళకి మాత్రం అన్యాయం జరగకూడదు. ఇప్పడు ఈ మాటలన్నీ సినిమా అంటుంది. అనడమే కాదు గెలుస్తుంది కూడా. అసలు విషయం  చూద్దాం.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ  మూలకి వెళ్లినా ప్రముఖ హీరో రాజ్ తరుణ్(raj tarun),లావణ్య(lavanya)ల విషయం గురించే చర్చ జరుగుతుంది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడని, గర్భవతిని కూడా చేసాడని లావణ్య ఆధారాలతో సహా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ తరుణ్ పై పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన నటించిన కొత్త సినిమా తిరగబడరా స్వామి రిలీజ్ పరిస్థితి ఏంటా అని సినీ అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సగర్వంగా అగస్ట్  2 న తిరగబడరా స్వామి  విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. 

గతంలో నిఖిల్ తో సూర్య వర్సస్ సూర్య, మంచు మనోజ్ తో శౌర్య లాంటి చిత్రాలని నిర్మించిన మల్కాపురం శివకుమార్ నిర్మాత  కాగా, యజ్ఞం,వీరభద్ర, పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలని అందించిన కేఎస్ రవికుమార్  దర్శకుడు.ఇక ఇందులో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా(malvi malhotra)హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఈ మాల్వి మల్హోత్రా విషయంలోనే రాజ్ తరుణ్ మీద లావణ్య తొరుగుబాటు చేసింది. మాన్వీ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకే తనని దూరం పెట్టాడనేది  లావణ్య ప్రధాన ఆరోపణ.

 



Source link

Related posts

300 కోట్ల హనుమాన్ హీరో  పిక్ వైరల్..కావాలనే నితిన్ మూవీని గుర్తు చేసాడు

Oknews

Ganesh Nimajjanam | నిమజ్జనం వేళ మెట్రో, ఎంఎంటీస్ సర్వీసుల టైం పొడిగింపు | ABP Desam

Oknews

Weather in Telangana Andhrapradesh Hyderabad on 17 March 2024 Summer updates latest news here | Weather Latest Update: గుడ్‌న్యూస్! చల్లబడ్డ వాతావరణం, మరో రెండు రోజులు వర్షాలు

Oknews

Leave a Comment