కన్నడ సినీ పరిశ్రమలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో పలు రకాల పాత్రలని పోషించి అశేష సినీ అభిమానుల మనస్సుని గెలుచుకున్న ఒక ధ్రువ తార నేలకొరిగింది. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అపర్ణ వస్తారే(aparna Vastarey)1984 లో వచ్చిన మనసాదు హొవు అనే చిత్రం ద్వారా కన్నడ సినీ రంగంలో కాలు మోపింది. ఆ తర్వాత సంగ్రామ, నమ్మొరా రాజా,సాహస వీర, ఇన్స్పెక్టర్ విక్రమ్, డాక్టర్ కృష్ణ ఇలా సుమారు పన్నెండు సినిమాల దాకా చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది. గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతు ఉంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆమె భర్త నాగరాజ్ వస్తరే తెలిపాడు. ఇక అపర్ణ మరణ వార్త తెలుసుకున్న చాలా మంది సినీ ప్రముఖులు ఆమె భౌతిక దేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలియచేసారు.
రేడియో జాకీ గా కూడా అపర్ణ ఆల్ ఇండియా రేడియోలో పని చేసింది. అదే విధంగా మొదలా మన్నే, మజ్జా టాకీస్ అనే టీవీ కామెడీ షోస్ కూడా చేసి లెక్కలు మించిన అభిమానులని సంపాదించింది. 2013 లో కన్నడలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం బెంగుళూరు మెట్రో రైలు అనౌన్సుమెంట్ లో వినిపించే వాయిస్ అపర్ణ దే. ఆమె వయసు 57 సంవత్సరాలు.