EntertainmentLatest News

మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మాత ఎవరో తెలిస్తే షాక్!


నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. తన రీసెంట్ లుక్స్ తో ఇప్పటికే మోక్షజ్ఞ అందరినీ ఫిదా చేశాడు. అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ మొదటి సినిమా ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటనే రావడమే ఆలస్యం అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాకి నిర్మాతగా ఒక సర్ ప్రైజింగ్ పేరు వినిపిస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini) నిర్మాతగా వ్యవహరించనున్నారట. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. కుర్ర హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటిది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. అదిరిపోయే స్టోరీ, భారీ బడ్జెట్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి శ్రీకారం చూడుతున్నారట. మరి మొదటి సినిమాతో మోక్షజ్ఞ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

కాగా, మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ మూవీ లాంచ్ అయ్యే అవకాశముంది.



Source link

Related posts

Mogalirekulu Pavitranath passed away మొగలిరేకులు దయ మరణానికి కారణాలు

Oknews

Pocharam Bhakar Reddy Resigns as Chairman of Nizamabad DCCB

Oknews

ఆ రోజు ఫ్యాన్ గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను..ప్రేమలు హీరోయిన్

Oknews

Leave a Comment