ధ్రువీకరణ పత్రాలు
అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుపోవాలి. ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, ఏపీఈఏపీసెట్-2024 హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు. పదో తరగతి లేదా పదో ఎస్ఎస్‌సీకి సమాన పరీక్ష సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, టీసీ, ఫార్మర్ కోటా కింద చేరే విద్యార్థులైతే రూరల్ ఏరియా విద్యార్థులు నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్, భూమికి సంబంధించిన అడంగల్, 1 బీ అదనపు సర్టిఫికేట్లు తీసుకురావాలి. వికలాంగు విద్యార్థులైతే పిహెచ్ సర్టిఫికేట్, డిఫెన్స్ పిల్లలైతే ఐడీ కార్డు, ఎన్‌సీసీ అభ్యర్థులైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్ అభ్యర్థులైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తప్పని సరిగా ఉండాలి. ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ అడ్మిషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.