EntertainmentLatest News

విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ.. ఇప్పుడు మరో ఓటీటీలోకి!


 


అజయ్ నాగ్ దర్శకుడిగా కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ మోహన్ భగత్ హీరోగా నటించిన మూవీ ‘ ఆరంభం’. ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే భారీ తారాగణం లేనందున ఎక్కవ పబ్లిసిటీ రాలేదు.

అయితే ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి రాగా అత్యధిక వీక్షకాధరణ పొందింది. అయితే ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి థ్రిల్ ను పంచే ఈ మూవీ ఏ అంచనాలు లేకుండా చూస్తే ఓ బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.

ఇది చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన చిన్న సినిమా. కానీ కథ ఒక ఫ్రేమ్ లో కరెక్టుగానే కూర్చుంటుంది. దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి అయోమయం లేకుండా నీట్ గా చెప్పాడు. ఎంచుకున్న ఈ కంటెంట్ కి గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరమవుతుంది. అయిన తమ బడ్జెట్ కి అందుబాటులో ఉన్న వనరులతోనే ముగించేశారు. కథలో కొత్తదనం ఉండటం వలన, గ్రాఫిక్స్ వైపు నుంచి కూడా ఆడియన్స్ పెద్దగా ఆలోచన చేయరు. తక్కువ పాత్రలు ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. విలేజ్ వాతావరణంలో ఈ కథను ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా ప్లస్ అయింది. మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. లొకేషన్స్ ఈ చిన్న కథకు పెద్ద హెల్ప్ చేశాయి. ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ మూవీని మిస్ అవ్వకండి.



Source link

Related posts

చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు.. షాక్‌ ఇచ్చిన చెర్రీ!

Oknews

అతనితో పడుకోమని పనిచేసేవాడు… ఆ దర్శకుడు 25 రోజులు నరకాన్ని చూపించాడు..!

Oknews

Mr Perfectionist in SSMB 29 బాలీవుడ్ హీరో కోసం రాజమౌళి ప్రయత్నాలు

Oknews

Leave a Comment