నాలుగు రైళ్ల ప్రయాణ, చేరే వేళల్లో మార్పులు
నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు, చేరే వేళల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లు వేళలు మారనున్నాయి. సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్ (12710) రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 11.05 గంటలకు బదులు రాత్రి 10.05 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.55కి గూడూరు చేరుకుంటుంది. ఈ రైలు తెల్లవారు జామున 3.35 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12764) రైలు ప్రయాణ వేళలు గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మారుతాయి. గూడురులో తెల్లవారు జామున 4.43 గంటలకు బదులుగా 4.19 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి ఉదయం 6.55 గంటలకు చేరుకుంటుంది.