మోహన్‌బాబు యూనివర్సిటీ (రంగంపేట, తిరుపతి)లో కోర్సుల ఫీజులు
ఏడాదికి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.1,30,000గా ఖరారు చేసింది. బీబీఎ, బీసీఏ, బీఎస్సీ (బయోఇన్‌ఫర్మటిక్), బీఎస్సీ (బయో టెక్నాలజీ), బీఎస్సీ (కంప్యూటర్ సైన్), బీఎస్సీ (మైక్రో బయోలజీ) కోర్సులకు ఫీజులు ఒక్కొదానికి రూ.44,500గా ఖరారు చేశారు. బీఎస్సీ (ఫోరెన్సిక్ సైన్) కోర్సు ఫీజు రూ.37 వేలు కాగా, బీ.ఫార్మసీ, ఫార్మా డీ, పార్మా (పీబీ) కోర్టులకు ఫీజులు ఒక్కొదానికి రూ.51,500గా నిర్ణయించారు. ఎం.ఫార్మసీ కోర్సు ఫీజు రూ.99,500 కాగా, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్), బీఏ (ఫిల్మ్ మేకింగ్), బీఏ (డైరెక్షన్), బీఏ (సినిమాటోగ్రఫీ), బీఏ (ఫోటోగ్రఫీ), బీఏ (సౌండ్ ఇంజినీరింగ్), బీ.డీజైన్ (కాస్టూమ్స్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.29,500గా నిర్ణయించారు. ఎంఎస్సీ (బయో టెక్నాలజీ), ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ. 73,500గా నిర్ణయించారు.