Health Care

లాఫింగ్ బుద్ధ మ్యాజిక్ ఏంటో తెలుసా.. ఇది ఉంటే అదృష్టం వరిస్తుందా!


దిశ, ఫీచర్స్ : ఇది బొద్దుగా, అందమైన సొట్ట బుగ్గలతో నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ లాఫింగ్ బుద్ధా బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అనే సంగతి తెలిసిందే. కొందరు మక్కువతో ఈ లాఫింగ్ బుద్ధ బొమ్మలను వారికి ఇష్టమైన ప్లేస్‌లలోపెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. మరీ ముఖ్యంగా ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందని ఆ ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలో కొందరికి కొన్ని సందేహాలు కూడా వస్తున్నాయి. అసలు ఎవరు ఈ లాఫింగ్ బుద్ధ..? అతనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలు మదిలో మెదులుతునే ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ లాఫింగ్ బుద్ధ ఎవరో తెలుసుకుందాం..!

అసలు విషయంలోకి వెళితే..లాఫింగ్ బుద్దాకి ఉన్న మ్యాజిక్ ఏంటంటే..వాస్తవానికి లాఫింగ్ బుద్ధ నవ్వే అసలు సిసలైన పాజిటివ్ ఎనర్జీ అంటారు మానసిన నిపుణులు. అసలు జీవితంలో కావాల్సిందే పాజిటివ్ ఎనర్జీనే కదా..అందుకే పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ కుటుంబంలో సంతోషాలు, లాభాలు వస్తాయి అదే లాఫింగ్ బుద్ధలో ఉన్న టెక్నిక్ అంటున్నారు నిపుణులు. ఎన్ని బాధల్లో ఉన్నా ముఖంలో చిరునవ్వు ఉంటే ఆ బాధల్ని జయించినట్లే అంటారు పెద్దలు కాబట్టి ఈ నవ్వుల బుద్దుడిలో ఉన్న మ్యాజిక్ కూడా ఇదే. అసలు లాఫింగ్(నవ్వు) అంటేనే పాజిటివ్ ఎనర్జీకి నిదర్శనం. లాఫింగ్ బుద్ధా బొమ్మలో ఉండేది ఆ నవ్వే. లాఫింగ్ బుద్ధా బొమ్మను కాసేపు అలాగే చూస్తుంటే మనకు తెలియకుండానే మన ముఖంలో నవ్వు వస్తుంది అదే పాజిటివ్. ఆ పాజిటివ్ లోనే దాగుంది అసలైన అదృష్టం. అందుకే చాలా మంది కార్లలో, ఇంట్లో, ఆఫీస్ క్యాబిన్‌లో ఇవి ఒక అలంకరణగా పెట్టుకుంటారు. అలా అని ఇవి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టకూడాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం అన్నింటికంటే చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే ఇంట్లోకి రాగానే పాజిటివ్ నవ్వుతో స్వాగతం పలికినట్లు ఉంటుంది ఈ లాఫింగ్ బుద్ధ బొమ్మ.



Source link

Related posts

బోనాల పండుగ వెనుకున్న రహస్యాలు ఇవే.. పండుగను ఎందుకు జరుపుతారో తెలుసా?

Oknews

అవకాడో నూనెతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు!

Oknews

మొటిమలతో బాధపడుతున్నారా!.. అయితే ఈ ఒక్క జ్యూస్‌తో మీ పింపుల్స్ అన్నీ పరార్

Oknews

Leave a Comment