‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో ‘దేవర’పై ఆడియన్స్‌లో, అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కొరటాల శివ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ని ఎంతో డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని రెండో పాటను త్వరలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఉన్న ఈ సినిమాలో సైఫ్ ఒక్కడే విలన్ అని ఇప్పటి వరకు అందరూ భావించారు. కానీ, మరో విలన్ కూడా అవసరమని భావిస్తోంది యూనిట్. ఎందుకంటే మొదటి భాగంతోపాటు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా కొంత జరిగింది. ఆ సమయంలోనే మరో బలమైన విలన్ ఉంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో విలన్ సెర్చింగ్ మొదలు పెట్టాడు కొరటాల. యానిమల్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన బాబీ డియోల్ అయితే కరెక్ట్‌గా సరిపోతాడని భావిస్తున్నారు. అందుకే చిత్ర యూనిట్ అతన్ని సంప్రదిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బాబీ డియోల్ ‘హరిహర వీరమల్లు’, ‘బాలయ్య 109’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆ మధ్య విడుదలై గ్లింప్స్‌తో ‘దేవర’ ఏ జోనర్‌లో ఉండబోతోందనే విషయం తెలిసింది. అయితే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, హీరోయిన్ జాన్వీ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ‘దేవర’ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మొదటి పాట పెద్ద హిట్ అయింది. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ‘దేవర’ పెద్ద సంచలనం సృష్టించడం ఖాయమని యంగ్ టైగర్ అభిమానులు ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.