EntertainmentLatest News

బాలీవుడ్  కడుపుమంట..తెలుగు డైరెక్టర్స్ మధ్య గొడవపెట్టాలని చూస్తున్నారు!


కల్కి 2898 ఏడి (kalki 2898 ad)రీసెంట్ గా వెయ్యి కోట్ల మార్కుని అందుకుంది. ఆ ఆనందంలో  దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇనిస్టా లో ఒక పోస్ట్ చేసాడు. భూతు, బ్లడ్, అశ్లీలత, రెచ్చగొట్టే అంశాలు లేకుండా  వెయ్యి కోట్లు సాధించిందని పోస్ట్ చేసాడు.దీంతో  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ని టార్గెట్ చేసాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా అయితే ఈ అంశాన్ని ప్రధానాంశంగా చేసుకొని తమ దైన స్టైల్లో విష ప్రచారాన్ని కలిపిస్తుంది.  దాంతో సందీప్ ఫ్యాన్స్  నాగీని అపార్థం చేసుకుంటున్నారు. ఈ టైంలో కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని అనుకుంటున్నాం.

సందీప్ రెడ్డి (sandeep reddy)దర్శకత్వంలో వచ్చిన  అర్జున్ రెడ్డి(arjun reddy)యానిమల్(animal)లో నాగీ పైన చెప్పిన అంశాలు చాలా మెండుగానే  ఉన్నాయి.  అందులో ఎలాంటి అబద్దం లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే  ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు అదే అంశాలతో వస్తున్నాయి.చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు.మోస్ట్ లీ అన్ని కూడా అదే బాపతు తో వస్తున్నాయి.ఈ లిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.పైగా కొన్ని సినిమాలు అయితే ట్రైలర్ తోనే తమ సినీ సువాసనని తెలియచేస్తున్నాయి. ఇప్పుడు హిందీ మీడియా మన తెలుగు దర్శకులు మధ్య చిచ్చుపెట్టాలని చూస్తుంది కాబట్టి వాళ్ళ భూతు ని ఒక్కసారి చూద్దాం. లేటెస్ట్ గా  బాడ్ న్యూజ్ (bad newz)అనే మూవీ రాబోతుంది.ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ దెబ్బకి యానిమల్ లో ఉన్న రొమాన్స్ నథింగ్. అడల్ట్ కంటెంట్ కి ఒక కొత్త  భాష్యం చెప్పేలా ఉంది. ఆ మాటకొస్తే  మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ కన్నా పచ్చి బూతుల సిరీస్ మరొకటి ఉండదనుకోండి. ఇక లేటెస్ట్ హిట్స్ పఠాన్, జవాన్ లలో ఉన్న హింస గురించి తెలిసిందే. నాగీ నిజంగానే ఒక డైరెక్టర్ ని కించపరచాలని పోస్ట్ చేసి  ఉంటే  పైన చెప్పుకున్న సినిమాల గురించని  కూడా  భావించవచ్చు.

ఏది ఏమైనా నాగీ  కేవలం తన సినిమా క్లీన్ ఎంటర్ టైనర్ అనే ఉద్దేశంతో  పోస్ట్ చేసింది తప్ప మరొకటి కాదని తెలుస్తుంది. నాగీ  అయితే  విమర్శలు రాగానే  తన పోస్ట్ ని తొలిగించాడు. అది తన హుందాతనానికి నిదర్శనం.  దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్ధమవుతుంది. త్వరలోనే సందీప్ ని  నాగీ కలిసే అవకాశం ఉందని. పైగా  సందీప్ త్వరలోనే నాగీ  ఎక్స్ క్లూసివ్ హీరో  ప్రభాస్ తో స్పిరిట్ చెయ్యబోతున్నాడు.  



Source link

Related posts

Nata Simham Balayya Speed Creates Sensation బాలయ్యా.. ఈ స్పీడ్ ఏందయ్యా!

Oknews

ఎన్టీఆర్ మామూలోడు కాదు.. ఒక్క సెకన్ లోనే…

Oknews

Why Allu Arjun Came to Sandhya Theater When Police Said No

Oknews

Leave a Comment