రక్షిత్ శెట్టి(rakshit shetty)కన్నడ సినీ పరిశ్రమలో తిరుగులేని హీరో. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. 777 చార్లీ, సప్తసాగరాలు దాటి సైడ్ ఏ అండ్ సైడ్ బి వంటి సినిమాలు తెలుగులోను రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఆయన మీద పోలీసు కేసు నమోదు అయ్యింది. దీంతో అభిమానులు ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు. అసలు విషయం ఏంటో చూద్దాం.
కన్నడ నాట మొన్న జనవరి 26 న విడుదలైన మూవీ బాచురల్ పార్టీ. పరంవా స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నే నిర్మించాడు. కేవలం నిర్మాతగానే వ్యవహరించాడు. డిగ్ నాద్, యోగేష్, అచ్యుత్ కుమార్ వంటి వారు ప్రధాన పాత్రల్లో చెయ్యగా అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు బాచురల్ పార్టీ మీదే కేసు నమోదు అయ్యింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఎంఆర్ టి, తమ సంస్థకి చెందిన పాటలని రక్షిత్ తన బాచురల్ పార్టీలో వాడాడని కేసు వేసింది. గాలి మాతు , న్యాయ ఎల్లిదే అనే రెండు పాటలకి మా నుంచి అనుమతి తీసుకోలేదనేది ప్రధాన ఆరోపణ.
ఈ మేరకు సంస్థకు చెందిన నవీన్ కుమార్ పోలీసులకి ఫిర్యాదు చేసాడు. నిజానికి గత నెలలోనే కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. తాజాగా నవీన్ కుమార్ కొన్ని పత్రాలు సమర్పించాడు. వాటిని పరిలించిన మేర మొన్న ఆదివారం రక్షిత్ కి నోటీసులు వెళ్లాయి. రక్షిత్ అయితే ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం వేరే స్టేట్ లో ఉన్నాడు. రాగానే ఆయన స్టేట్ మెంట్ ని కూడా తీసుకోనున్నారు.ఇక గతంలో రక్షిత్ శెట్టి కి ప్రముఖ హీరోయిన్ రష్మిక(rashmikha)తో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం ఇద్దరు ప్రేమించుకున్నా కూడా ఆ బంధం పెళ్లి దాకా వెళ్లలేక పోయింది.