Health Care

యాలకులతో బీపీ కంట్రోల్ | Benefits With Cardamom


దిశ, ఫీచర్స్: యాలకులు లేదా ఇలాచి ‘ క్వీన్ ఆఫ్ స్పైసెస్ ‘ గా కీర్తించబడుతుంది. ప్రత్యేకమైన ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది. కాగా ఈ అరొమాటిక్ స్పైస్ మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుందో చెప్తున్న నిపుణులు.. తరుచుగా వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.

జీర్ణక్రియ : యాలకులు జీర్ణక్రియను స్టిమ్యులేట్ చేస్తాయి. ఉబ్బరం, గ్యాస్ లాంటి అసౌకర్యాలను తగ్గిస్తాయి. పూర్తి డైజెస్టివ్ హెల్త్ ను కాపాడుతాయి.

తాజా శ్వాస : ఇలాచిలో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని తరచుగా రోజుకొకటి తీసుకున్నా చెడు శ్వాస నుంచి విముక్తి కలుగుతుంది. దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బాడీ డిటాక్సీఫైర్: యాలకులు సహజమైన డిటాక్సీఫైర్ గా పని చేస్తాయి. మందు, డ్రగ్స్ కారణంగా శరీరంలోకి ప్రవేశించిన విషపూరిత పదార్థాలను బయటకు పంపిస్తాయి. వ్యర్థాలను రిమూవ్ చేయడం ద్వారా లివర్ హెల్త్ కు సపోర్ట్ చేస్తాయి.

మెటబాలిజం : ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మెటబాలిజం వృద్ధి చెందుతుంది. సరైన బరువు మెయింటైన్ చేయడంలో, కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

బీపీ కంట్రోల్ : పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఇలాచి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. హై బీపీ తగ్గించి.. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉచ్చుతుంది.

చర్మ ఆరోగ్యం : తరుచుగా యాలకులు తీసుకున్నట్లయితే స్కిన్ హెల్త్ కూడా బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. మొటిమలు, మచ్చలను తగ్గించి.. స్కిన్ గ్లో పెంచుతుంది. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కలిగిస్తుంది.

నోట్ : పైన ఇచ్చిన కంటెంట్ నిపుణులు ఇంటర్నెట్ లో పంచుకున్నది మాత్రమే.



Source link

Related posts

ఎండా కాలంలో తాటి ముంజలు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా? షుగర్ పేషంట్లకు వరప్రసాదం..

Oknews

ఘోస్ట్ బుక్.. ధర రూ.7 కోట్లు!.. స్పెషాలిటీ ఏంటంటే..

Oknews

రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలు ఇవే.. వీటితో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

Leave a Comment