ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Double ISMART) 2019 జులైలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మాస్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తోంది. ఆగష్టు 15న ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.
మణిశర్మ స్వరపరిచిన ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. సినిమా సక్సెస్ లో మణిశర్మ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. దాంతో ‘డబుల్ ఇస్మార్ట్’ ఆడియోపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పమార్’ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ గా ‘మార్ ముంత చోడ్ చింత’ (Maar Muntha Chod Chinta) విడుదలైంది.
‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ మాస్ ని మెప్పించేలా ఉంది. మణిశర్మ మరోసారి మాస్ బీట్ తో అదరగొట్టాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ తమ గాత్రంతో పాటకి మరింత జోష్ తీసుకొచ్చారు. ఇక లిరికల్ వీడియోలో హీరో రామ్ తన ఎనర్జీతో ఎప్పటిలాగే మ్యాజిక్ చేశాడు. మొత్తానికి థియేటర్లలో ఈ సాంగ్ కి మాస్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేలా ఉంది.