దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు వెరైటీ కోసం ఏం చేసినా అది నాలుగు గోడల మధ్యే ఉండేది. మహా అయితే మన చుట్టు పక్కల వాళ్లకు, స్నేహితులకు తెలిసేది. కానీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక, అందులోనూ సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ముఖ్యంగా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోలు, వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ అలాంటి ఆసక్తి రేకెత్తించే మరో వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండగా, ఇందులో ఇద్దరు యువతులు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.
వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఇద్దరు అమ్మాయిలు ఓ మెట్రో రైల్ ఎక్కి భోగీ లోపల కూర్చున్నారు. అక్కడ జనం ఎవరూ కనిపించడం లేదు. ఖాళీగా ఉన్నందుకో ఏమో కానీ, వారు తమ బ్యాగుల్లోంచి మేకప్ కిట్ బయటకు తీసి.. ముఖానికి మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక అక్కడ వాళ్లు కూర్చున్న తీరు కూడా ఏదో బ్యూటీ పార్లర్లో దర్జాగా కూర్చున్నట్టే ఉంది. దీనిని ఓ యూజర్ delhi.connection అనే ఇన్‌స్టా ఐడీలో షేర్ చేయగా ఈ వీడియో చూసిన నెటిజన్లు లైక్ చేయడంతోపాటు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. జర్నీలో ఇలా కూడా చేస్తారా? అని కొందరు పేర్కొనగా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.
video Link Credits to delhi.connection instagram id