మూవీ : హాట్ స్పాట్
నటీనటులు: కళైయారసన్, సోఫియా, సాండీ, అమ్ము అభిరామి, జననీ, గౌరీ జి. కిషన్ , సుభాష్, ఆదిత్య భాస్కర్
ఎడిటింగ్: యూ. ముత్యన్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్
మ్యూజిక్: సతీష్ రఘనాథన్ వాన్
నిర్మాతలు: కె. జె. బాలమనీమరబాన్ , సురేష్ కుమార్
దర్శకత్వం: విఘ్నేష్ కార్తిక్
ఓటీటీ: ఆహా
తమిళ్ లో ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన ఆంథాలజీ చిత్రం”హాట్ స్పాట్”. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం.
కథ:
ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి దర్శకుడు అవ్వాలనుకున్న మహమ్మద్ షఫీ(విఘ్నేష్ కార్తిక్) వస్తాడు. ఇక అప్పటికే చాలా కథలు విని అలసిపోయిన ప్రొడ్యూసర్ బాలమణిమారన్ ఇతని పదే నిమిషాల సమయం ఇస్తాడు. అతను కథ లైన్ చెప్పమని అడిగినప్పుడు.. షఫీ అర్థవంతంగా చెప్తాడు. దాంతో పూర్తి కథనచెప్పమని ప్రొడ్యూసర్ అనగా.. తను సినిమాగా తీయాలనుకున్న కథని చెప్తాడు. మరి షఫీ చెప్పిన కథ ప్రొడ్యూసర్ బాలమణిమారన్ కి నచ్చిందా? అసలు షఫీ రెండు కథలో ఫోన్ లో మాట్లడిన అమ్మాయి ఎవరు? అతను చెప్పిన కథల్లో వాస్తవమెంత అనేది సినిమా స్టోరీ.
విశ్లేషణ:
కథ చెప్పడానికి ప్రోడ్యూసర్ దగ్గరకి వచ్చిన ఓ యంగ్ రైటర్ మైండ్ లో ఎన్నో ప్రశ్నలు.. అసలు ఎలా స్టార్ట్ చేయాలని ఎలా ముగించాలని.. అలా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో కథ మొదలవుతుంది. ఇక ఈ సినిమాని ఎపిసోడ్ ల వైజ్ తీసుకొచ్చాడు దర్శకుడు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో విభిన్న కథ ఉండటంతో దేనికదే ప్రత్యేకం అన్నట్టు సాగుతుంది.
ఈ మూవీ నాలుగు పర్వాలుగా ఉంటుంది. మొదటిది హ్యాపీ మ్యారీడ్ లైఫ్, సెకెండ్ ది గోల్డెన్ రూల్స్, మూడవది టమోటో చట్నీ, నాల్గవది ఫేమ్ గేమ్. ఇలా ఒక్కో పర్వం ఒక్కో ఎపిసోడ్ లాగా ఉంటుంది కానీ దేనికదే సపరేట్.. ఢిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సాగే ఈ మూవీలోని మొదటి ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. కానీ రెండు, నాలుగు ఎపిసోడ్ లు పెద్దగా ప్రభావం చూపలేకపోతాయి. ఎందుకంటే ఒక్కో దాంట్లోని పాత్రలు కాస్త భిన్నంగా ఉంటాయి.
మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఓ సమస్యని క్రియేట్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చూపించే ప్రయత్నంలో ఓ క్లిష్టమైన పాయింట్ ని దర్శకుడు ఎంచుకున్నాడు. దాంతో రెండో ఎపిసోడ్ పేలవంగా సాగుతుంది. ఆ తర్వాత మూడవ ఎపిసోడ్ ఆసక్తిగా ఉంటుంది. ఇక నాల్గవ దాంట్లో కథనం నెమ్మదిగా ఉంటుంది. దాంతో ఆడియన్ కి బోరింగ్ అనిపిస్తుంది. పైగా అశ్లీల సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. బూతులు కూడా ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. మూడవ ఎపిసోడ్ బాగున్నప్పటికి నాల్గవది పెద్దగా ఇంపాక్ట్ చూపకపోయేసరికి ఆడియన్ కి సినిమా బాగోలేదనే భావన కలుగుతుంది. మూవీ నిడివి చిన్నదే అయిన ఇండివిడ్యువల్ గా చూడటమే బెటర్. సతీష్ రఘునాథన్ మ్యూజిక్ పర్వాలేదు. గోకుల్ సినిమాటోగ్రఫీ ఒకే. యూ సత్యన్ ఎడిటింగ్ లో కాస్త కేర్ తీసుకుంటే బాగుండు. రెండు, నాలుగు ఎపిసోడ్ లోని కొన్ని సీన్లని తీసేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ధన్య పాత్రలో గౌరీ జి. కిషన్, విజయ్ గా ఆదిత్య భాస్కర్, అనితగా జననీ, సిద్దార్థ్ గా శాండీ, దీప్తిగా అమ్ము అభిరామి, వెట్టిగా సుభాష్ , ఎజుమలైగా కళైయరసన్ ఆకట్టుకున్నారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఢిఫరెంట్ స్టోరీలని ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది. స్లోగా సాగే కథనం, అడల్ట్ కంటెంట్ ఒకే అంటే ఓసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్