EntertainmentLatest News

‘జస్ట్‌ ఎ మినిట్‌’ మూవీకి ఘాజీ డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డి సపోర్ట్‌! 


ఏడు చేపల కథ చిత్రం ద్వారా పరిచయమైన అభిషేక్‌ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్‌, వినీషా జ్ఞానేశ్వర్‌ హీరోయిన్లుగా కార్తీక్‌ ధర్మపురి సమర్పణలో రెడ్‌ స్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సుధర్మ మూవీ మేకర్స్‌ బేనర్స్‌పై యశ్వంత్‌ దర్శకత్వంలో తన్వీర్‌, ప్రకాష్‌ ధర్మపురి నిర్మించిన సినిమా ‘జస్ట్‌ ఎ మినిట్‌’. ఈ సినిమాను నిర్మించిన సుధర్మ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, సినిమా ట్రైలర్‌ను ఘాజి, అంతరిక్షం చిత్రాల దర్శకుడు సంకల్ప్‌రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి మాట్లాడుతూ ‘సుధర్మ మూవీ మేకర్స్‌ లోగో, జస్ట్‌ మినిట్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్‌ ధర్మపురితో నాకు మంచి అనుబంధం ఉంది. టెక్నికల్‌గా ఎంతో నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. జస్ట్‌ ఎ మినిట్‌ సినిమాతో ప్రొడక్షన్‌ వైపు వచ్చారు. అదేవిధంగా అభిషేక్‌ రెడ్డి గతంలో చేసిన ఏడు చేపల కథ సినిమా ఒక మంచి మెసేజ్‌ ఉన్న సినిమా. నాకు తెలిసి ఉన్న ఇద్దరు జస్ట్‌ ఎ మినిట్‌ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడం మంచి విషయం. ఇదొక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ సినిమా కార్తీక్‌ కి అభిషేక్‌ రెడ్డికి మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాతలు తన్వీర్‌, ప్రకాష్‌ ధర్మపురి మాట్లాడుతూ ‘ఎంతో బిజీగా ఉండి కూడా మా కోసం సమయం కేటాయించి  మా సుధర్మ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లోగో మరియు మా జస్ట్‌ ఎ మినిట్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ చేసిన సంకల్ప్‌రెడ్డిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తున్నాం.  ప్రేక్షకులు సినిమా చూసి మంచి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

 



Source link

Related posts

కల్కి2 లో చంద్రముఖి… భారీ రెమ్యూనరేషన్

Oknews

Telangana Deputy Cm Bhatti Vikramarka Says Will Discuss Nandi Awards Issue In Telangana Cabinet

Oknews

నిజాన్ని తెలుసుకున్నాను..సమంత సంచలన కామెంట్స్

Oknews

Leave a Comment