తెలుగు సినీ పరిశ్రమ దినదినాభివృద్ది చెందుతోంది. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను రూపొందించటానికి మన మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా కథ, మేకింగ్ విషయాల్లోనే కాదు, ప్రమోషన్స్ పరంగానూ సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా టీమ్స్ ప్రేక్షకులకు చేరువకావటానికి వినూత్నమైన ప్రమోషనల్ ప్లానింగ్‌ను సిద్ధం చేశాయి.
సినిమా ప్రమోషనల్ ప్లానింగ్‌లో ఇదొక యూనిక్ పాయింట్. ‘ఆయ్’ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ చిత్ర యూనిట్ ఆగస్ట్ నెలలోనే రిలీజ్ కానున్న ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా టీమ్‌తో శుక్రవారం క్రికెట్ ఆటలో పోటీ పడనుంది. ‘ఆయ్’ సినిమా నిర్మాత బన్నీ వాస్.. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.