ఈ హీరోకు ఈ ఏడాది కలిసొస్తుందా..?


ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశాడు విశ్వక్ సేన్. చాలామంది హీరోలకు భిన్నంగా జోరుగా సినిమాలు చేస్తూ, అంతే వేగంగా థియేటర్లలోకి వస్తున్నాడు. అయితే సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోతున్నాడు.

ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన గామి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ డబ్బులు రాలేదు. విశ్వక్ నటనకు పేరొచ్చింది, సినిమా మాత్రం ఆడలేదు.

ఇక రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ చేశాడు. తన కెరీర్ లోనే కల్ట్ మూవీ అవుతుందంటూ ప్రమోషన్స్ లో విశ్వక్ చెప్పిందేదీ నిజం కాలేదు. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా, థియేటర్లలో జనాలకు నీరసం తెప్పించింది.

అలా ఇప్పటివరకు విడుదల చేసిన 2 సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన విశ్వక్ సేన్, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రెడీ చేస్తున్నాడు. దీపావళికి మెకానిక్ రాకీ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఇంతకుముందు 2 సినిమాలకు కూడా మంచి రిలీజ్ డేట్స్ సెట్ చేసుకున్నాడు విశ్వక్. అదే విధంగా మెకానిక్ రాకీకి కూడా దీపావళిని సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే, విశ్వక్ కు ఈ ఏడాది కలిసొచ్చినట్టే అనుకోవాలి. లేదంటే అతడు తన సినిమాల్ని పునఃసమీక్షించుకోవాలి.

The post ఈ హీరోకు ఈ ఏడాది కలిసొస్తుందా..? appeared first on Great Andhra.



Source link

Leave a Comment