Andhra Pradesh

రాజ్ తరుణ్, లావణ్య ఇంకా ‘సింక్’లోనే ఉన్నారా? Great Andhra


రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్న లావణ్యకు మాల్వి మల్హోత్రా నంబర్ ఎలా దొరికింది… ఆమె తల్లిదండ్రులు, సోదరుడి ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయి.. అసలు రాజ్ తరుణ్ కు మాల్వి మల్హోత్రాకు ఎఫైర్ ఉందనే అనుమానం లావణ్యకు ఎందుకొచ్చింది..

ఈ ప్రశ్నలన్నింటికీ ఆదిలోనే సమాధానం ఇచ్చింది లావణ్య. తన పేరు మీద కొన్న సిమ్ కార్డు రాజ్ తరుణ్ ఫోన్ లో ఉందని.. రాజ్ పేరిట ఉన్న సిమ్ తన ఫోన్ లో ఉందని చెప్పింది. అక్కడితో అయిపోలేదు. తమ రెండు ఫోన్ల డేటాలు సింక్ అవుతాయని, అన్నీ ఒకే చోట బ్యాకప్ అవుతాయని చెప్పుకొచ్చింది. అలా అందరి నంబర్లు తను సంపాదించగలిగానని అంటోంది.

లావణ్య తెలివైనదే, టెక్నాలజీని బాగానే వాడుకుంది. మరి రాజ్ తరుణ్ అంత అమాయకుడా? ఓవైపు ఇంత జరుగుతుంటే, తన ఫోన్ నుంచి సమస్తం సింక్ అవుతుంటే జాగ్రత్త పడలేదా? ఇప్పటికీ అవే అనుమానాలు కలుగుతున్నాయి అందరికీ.

రీసెంట్ గా రాజ్ తరుణ్ ఛాట్ చేశాడని చెబుతున్న వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కొన్ని లీక్ అయ్యాయి. అందులో మాల్వీ మల్హోత్రాతో ఛాటింగ్ చేస్తున్న మెసేజీలు, ఎమోజీలున్నాయి. ఓ ఛాటింగ్ లో మాల్వీకి ఐ లవ్ యు చెప్పాడు రాజ్ తరుణ్. మరో చోట ముద్దులతో ముంచెత్తుతానంటూ పోస్టు పెట్టాడు. వీటికి ప్రతిగా మాల్వి కూడా ఐలవ్ యు టు అని రిప్లయ్ ఇవ్వడంతో పాటు, ముద్దులకు రెడీ అంటూ రెచ్చగొట్టింది.

అక్కడితో అయిపోలేదు. వీళ్లిద్దరూ తరచుగా కలుసుకునే లొకేషన్లు కూడా అందులో ఉన్నాయి. కోయంబత్తూరులోని మాధవ హోటల్ లో రాజ్ తరుణ్ కోసం పలుమార్లు రూమ్స్ బుక్ చేసింది మాల్వి. ఆమె కోసం రాజ్ తరుణ్ ఫ్లయిట్ టికెట్లు బుక్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయిందులో.

ఈ స్క్రీన్ షాట్స్ లో నిజం ఎంత.. నిజంగానే రాజ్-మాల్వి మధ్య నడిచిన ఛాటింగేనా అనే సంగతి పక్కనపెడితే.. చూడగానే నమ్మే విధంగా ఉన్న ఈ స్క్రీన్ షాట్స్ ను అసలు ఎవరు లీక్ చేశారనేది ప్రశ్న. ఇంకా రాజ్ తరుణ్ ఫోన్, లావణ్య ఎకౌంట్ కే సింక్ అయి ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే కనుక నిజమైతే రాజ్ తరుణ్ ఈ కేసులో మరింత లోతుగా కూరుకుపోయినట్టే.



Source link

Related posts

AP Assembly Speaker : ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు – రాజకీయ ప్రస్థానం ఇదే

Oknews

Tirumala : శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

Oknews

టీటీడీ ఆన్‌లైన్‌ టిక్కెట్ల విడుదల, అందుబాటులో అక్టోబర్ కోటా-ttd online ticket release october quota available ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment