పూర్తిగా కోలుకున్న పీపుల్ స్టార్ Great Andhra


కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నటుడు-దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దేవుడి దయ వల్ల తను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపిన నారాయణ మూర్తి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం కోసం వాకబు చేసిన, పూజలు చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పారు. “ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా” అన్నారు.

ఈనెల 17న ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు ఆర్.నారాయణ మూర్తి. ఆ టైమ్ లో ఆయన మాట్లాడలేకపోయారు. తనకు చాలా నీరసంగా ఉందని, మాట్లాడలేకపోతున్నానని, ఊపిరి ఆడడం లేదంటూ ఆయన పక్కవాళ్లతో అన్నారు. వెంటనే ఆయన్ను నిమ్స్ లో చేర్చారు.

నిమ్స్ వైద్యులు బీరప్ప, నారాయణమూర్తిని ట్రీట్ చేశారు. ఆయనకు సాధారణ పరీక్షలే నిర్వహించామని తెలిపిన వైద్యులు, ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. 2 రోజులు పర్యవేక్షణలో ఉంచి, డిశ్చార్జ్ చేస్తామన్నారు. చెప్పినట్టుగానే ఈరోజు డిశ్చార్జ్ చేశారు.

తను బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతానని, తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా వివరిస్తానని తెలిపారు ఆర్.నారాయణ మూర్తి. సో.. త్వరలోనే ఆయన మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎప్పట్లానే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించడంతో పాటు.. అందులో తనే లీడ్ రోల్ పోషిస్తున్నారు. నిర్మాత కూడా ఆయనే.



Source link

Leave a Comment