సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్నది కామన్. చిన్న అవకాశం దొరకాలి కానీ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. కానీ ఇలాంటి ట్రోలింగ్ లు పాల పొంగు లాంటివి. సర్రున పైకి లేచి చప్పున చల్లారిపోతాయి. కానీ అలా కాకుండా ప్లాన్డ్ గా ట్రోలింగ్ అనేది మెలమెల్లగా క్యారెక్టర్ అసాసినేషన్ దిశగా మారుతోంది అంటే కాస్త అనుమానించాల్సి వుంటుంది. దీని వెనుక ఏదో సమ్ థింగ్.. సమ్ థింగ్ అని.
బన్నీ తాగి సెట్ కు వస్తాడని, ఫ్యాన్స్ ను కొడతాడనేంత వరకు వెళ్లింది ఈ క్యారెక్టర్ అసాసినేషన్. నిజానికి ఇది ఎప్పుడూ లేదు. అలాంటిది వుంటే ఇప్పటికే పలుసార్లు గ్యాసిప్ ల రూపంలో బయటకు వచ్చి వుండేది. బన్నీ సెల్ఫ్ మేడ్, కష్టపడతాడు అనే పాజిటివ్ వార్తలతో పాటు, బన్నీ కాస్త ఇగో ఎక్కువ అనే గ్యాసిప్ మాత్రమే ఇప్పటి వరకు వుంది. బన్నీ తన ఇమేజ్ ను తానే చాలా ప్లాన్డ్ గా పెంచుకుంటూ వస్తున్నాడు అనే మాట మాత్రమే వుంది.
హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి నంద్యాల వెళ్లిన దగ్గర నుంచి ప్రారంభమైంది ట్రోలింగ్. అది సహజం. యాంటీ పార్టీ, యాంటీ ఫ్యాన్స్ కు కోపం వస్తుంది కనుక ఇది కామన్ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇది అక్కడితో ఆగలేదు. సమయం దొరికినపుడల్లా బన్నీ టార్గెట్ అవుతున్నాడు. అది కూడా వెల్ ప్లాన్డ్ గా. అంటే ఎలా..ఎ వరో ఎక్కడో ఏదో మాట్లాడతారు. అది ట్వీట్ గా మారుతుంది. ఆపై మీమ్స్ గా మారుతుంది. ఆపైన ఇన్ స్టా లో వైరల్ గా మారుతుంది. ఇదంతా ఓ పద్దతి ప్రకారం, త్రివిక్రమ్ చెప్పినట్లు గోడకట్టినట్లు, అంటు కట్టినట్లు, శిల్పం చెక్కినట్లు చాలా జాగ్రత్తగా జరుగుతూ వస్తోంది.
అంటే కేవలం యాంటీ ఫ్యాన్స్ మాత్రమే అంటే ఇలా జరగదు. ఇంకా అంతకు మించి ఏదో వుంది. అంటే వెల్ ఆర్గనైజ్డ్ డిజిటల్ మీడియా లేదా, సోషల్ మీడియా సంస్థల అండ దండ వుండి వుండాలి. బన్నీ సన్నిహితులు కూడా ఇప్పుడు ఇదే అనుమానపడుతున్నారు. ఏం జరుగుతోంది.. ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు. కేవలం పాలిటిక్స్ మాత్రమేనా.. అంతకు మించినది ఏమైనా వుందా? అని..
పాన్ ఇండియా హీరో పోటీ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తోంది. ఎందుకంటే టాప్ హీరోలు అంతా పాన్ ఇండియానే. బన్నీ తో సహా ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా అడుగు పెట్టేసారు. మహేష్ అడుగు పెట్టబోతున్నారు. వాళ్ల మధ్య పోటీ ఎలా వున్నా. వాళ్ల ఫ్యాన్స్ మధ్య పోటీ భయంకరంగా పెరిగింది. ఈ పోటీని ముందు పెట్టి, తెర వెనుక ఎవరైనా బన్నీని టార్గెట్ చేస్తున్నారా అన్నది కూడా ఒక అనుమానంగా వుంది.
ప్రస్తుతం బన్నీ టీమ్ ఈ పజిల్ ను సాల్వ్ చేసే పనిలో వుంది. అంతకన్నా ముందుగా ఓ భయంకరమైన పాన్ ఇండియా హిట్ కొడితే ఇవన్నీ తగ్గుతాయి అనే ఆలోచన వుంది. కానీ ఆ ఆలోచన కు పుష్ప విడుదల బ్రేక్ వేస్తోంది. అది విడుదల కావాలి. బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడు కానీ బన్నీ క్యారెక్టర్ అసాసినేషన్ ఆగదు.
The post ట్రోలింగ్ బన్నీ.. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? appeared first on Great Andhra.