Andhra Pradesh

వైసీపీలో గోడ మీద పిల్లులు? Great Andhra


ఆయన ఇప్పుడు ఎటు చూస్తున్నారు అంటే సొంత గూటికి పోవడానికి అని అంటున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో టీడీపీ నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వైసీపీలోకి వచ్చారు. వైసీపీ టికెట్ ని సంపాదించుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు.

ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని నడపాలన్నా తన రాజకీయ ఆర్ధిక వ్యవహారాలు సాఫీగా సాగాలన్నా కూడా సైకిలెక్కేయడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఆయనకు టీడీపీ ద్వారానే పదవులు దక్కాయి. మళ్లీ టీడీపీలోకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాని కోసం ఆయన తనదైన పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఓటమి పాలు అయిన తరువాత ఆయన పెద్దగా వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు అని అంటున్నారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీలో కూడా సరైన నాయకత్వం లేకపోవడం కూడా వాసుపల్లికి కలసివచ్చేలా ఉందని అంటున్నారు. దాసుని తప్పులు దండంతో సరి అని చెప్పి ఇక మీదట బాగానే ఉంటామని టీడీపీ అధినాయకత్వానికి వాసుపల్లితో పాటు వైసీపీలో ఉన్న పలువురు విన్నపాలు పంపిస్తున్నారు అని అంటున్నారు.

టీడీపీ పెద్దలు కనుక సరేనంటే పోలోమంటూ చాలా మంది వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. దాంతో వైసీపీలో గోడ మీద పిల్లులు ఎంత మంది అన్న లెక్క వైసీపీకి అందడం లేదు అని అంటున్నారు.



Source link

Related posts

వారికి మళ్లీ పోస్టింగ్? అధికారుల్లో చర్చగా మారిన కలెక్టర్ల బదిలీ, అధికార పార్టీలో కూడా నిరసనలు-transfer of the collectors which became a debate among the officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP TET Updates 2024 : రేపట్నుంచి ఏపీ 'టెట్' పరీక్షలు – ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులను ఇలా రాసుకోవచ్చు

Oknews

CBN On Jagan: జగన్‌ను గౌరవించండి.. ఎమ్మెల్యేలకు, అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం

Oknews

Leave a Comment