తగ్గేదేలే.. 15కి కూడా పోటీ


పెద్ద సినిమాలు, ఓ మోస్తరు బడ్జెట్ మూవీస్ ను సాధారణ రోజుల్లో (అన్-సీజన్ లో) విడుదల చేయడానికి భయపడుతున్నారు మేకర్స్. అందరికీ ఇప్పుడు పండగ తేదీలు కావాలి. కుదరకపోతే లాంగ్ వీకెండ్స్ కావాలి.

ఒకప్పుడు దీపావళి, శివరాత్రి లాంటి అకేషన్స్ ను టాలీవుడ్ పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు ఆ తేదీల్ని కూడా వదలడం లేదు. 4-5 నెలల ముందే కర్చీఫులు వేస్తున్నారు. ఇప్పుడు ఆగస్ట్ 15 కూడా అలానే తయారైంది.

ఈసారి ఆగస్ట్ 15కు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 సినిమాలొస్తున్నాయి. వీటిలో 3 పెద్ద సినిమాలుండడం విశేషం.

లెక్కప్రకారం ఆగస్ట్ 15కి పుష్ప-2 రావాలి. ఎప్పుడైతే అది వాయిదా పడిందో ఆ వెంటనే డబుల్ ఇస్మార్ట్ ను ప్రకటించారు. అది ప్రకటించిన కొన్ని రోజులకే ఆయ్ సినిమా వస్తున్నట్టు ప్రకటించారు.

అటు కోలీవుడ్ నుంచి తంగలాన్ కూడా 15కే సిద్ధమైంది. ఆటోమేటిగ్గా తెలుగు వెర్షన్ కూడా అదే తేదీకి టాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల మధ్యలో “35 – చిన్న కథ కాదు” అనే చిన్న సినిమాను కూడా ప్రకటించేశారు.

ఓవైపు ఇలా పోటీ నడుస్తుండగానే, ఉరుములేని పిడుగులా మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ డేట్ పెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కూడా 15కే రాబోతోంది. సో.. ఆగస్ట్ 15కి రవితేజ, రామ్ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ షురూ అయింది.

The post తగ్గేదేలే.. 15కి కూడా పోటీ appeared first on Great Andhra.



Source link

Leave a Comment