Andhra Pradesh

YS Sharmila : సొంత బాబాయ్ ను హత్య చేసినప్పుడు దిల్లీలో ధర్నా చేయలేదే?


రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలి

ఏపీలో వర్షాలు బీభత్సా్న్ని సృష్టించాయని వైఎస్ షర్మిల అన్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడిన రైతన్నలను వర్షాలు మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేకపోవడం… గేట్లు ఊడిపోయిన సందర్భాలు చూశామన్నారు. ఇటీవల వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేసి వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందని, దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. ఏపీలో ఒక్కొక్క రైతుకు సగటున 2.5 లక్షల అప్పు ఉందని, ఏపీలో రైతులకు రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఏపీ ఎంపీలు అందరూ బీజేపీకే మద్దతు పలుకున్నారని, కానీ పదేళ్లుగా బీజేపీ ఏపీకి ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. కేంద్ర బడ్జె్ట్ లో ఏపీకి ఎప్పుడూ మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ ఏడాదైనా ఏమైనా మార్పుంటుందేమో చూడాలన్నారు. రాజధానికి కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుందని, రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ విషయంలో ఇన్నాళ్లు వైసీపీ , బీజేపీ నాటకాలు ఆడాయన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ స్పెషల్ ప్యాకేజీలు, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా ఈ హామీలను కేంద్రం ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని వైఎస్ షర్మిల అన్నారు.



Source link

Related posts

AP Cabinet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుపై చర్చ, నేడు ఢిల్లీకి చంద్రబాబు

Oknews

AP Govt Jobs 2024 : ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు – అర్హతలు, ముఖ్య తేదీలివే

Oknews

అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదు, వైసీపీపై వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్-mylavaram news in telugu ysrcp mla vasantha krishna prasad sensational comments on cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment