Andhra Pradesh

పవన్ భజన కావాల్సిందే.. మరీ ఇంతగానా?


పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడులాగా కనిపించడానికి పవన్ అన్నయ్య నాగబాబు తపన పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దాని మీద తాను స్పందించడం, తన విలువైన అభిప్రాయాన్ని తెలియజెప్పడం అనేది ఒక ప్రాథమిక బాధ్యత అన్నట్టుగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు.

తాను ఏ పనిచేసినా.. ఏ మాట మాట్లాడినా.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను కీర్తించడం అనేది ఆయన ముద్ర! తాజాగా పవన్ కల్యాణ్ ను కీర్తించడంలో ఆయన కొత్త ఎత్తులకు వెళ్లారు. తాను చెబుతున్నది అబద్ధం అని ఆయన గ్రహించారో లేదో మరి.

ఇటీవలి కాలంలో వేర్వేరు సందర్భాల్లో మరణించిన సుమారు 81 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున బీమా సహాయాన్ని నాగబాబు అందించారు. మొత్తం 4.05 కోట్ల రూపాయల మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనసులోంచి పుట్టిన అతి గొప్ప ఆలోచన.. కార్యకర్తలకు బీమా అని చెప్పుకొచ్చారు. ఇక్కడే ఆయన పాయింట్ తేడా కొడుతోంది.

తమ్ముణ్ని కీర్తించడం ఈ అన్నయ్యకు అవసరమే గానీ. అందులో ఔచిత్యం చూసుకోకపోతే నవ్వులపాలు అవుతారు కదా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. కార్యకర్తలకు బీమా చేయించడం, వారు అకాల మరణం పాలైతే వారికి బీమా సాయం అందించడం అనేది పవన్ కల్యాణ్ కనిపెట్టిన పద్ధతేం కాదు.

నిజానికి ఇది చాలా పార్టీలు చేస్తున్నదే. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నారా లోకేష్ పూనికతో తెలుగుదేశం పార్టీ లో ఎన్నడో అమల్లోకి వచ్చింది. తెదేపా కార్యకర్తలు ఇలాంటి బీమా ద్వారా అనేకమంది లబ్ధిపొందారు. లోకేష్ పార్టీ కోసం చేసిన ఈ బీమా ఆలోచన హిట్ అయింది. అయితే నాగబాబుకు ఇవన్నీ తెలియకపోవచ్చు. బహుశా అప్పట్లో ఆయన టీవీ షోలు చేసుకుంటూ ఉండి ఉంటారు. ఆయనకు తెలియకపోవడం తప్పు కాదుగానీ.. పవన్ కల్యాణ్ చేసిన ఒక కాపీ ఆలోచనను, మనసులోంచి పుట్టిన సొంత ఆలోచనగా ప్రచారం చేయడం తప్పే కదా అని పలువురు అంటున్నారు.

అలాగే.. ప్రస్తుతం ఈనెల 28 వరకు జనసేన క్రియాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా నడిపించడానికి, ఎక్కువ మంది పార్టీలో చేరేలా ప్రచారం చేయడానికి ఇలా.. ఇదే సమయంలో ఏకంగా 81 కుటుంబాల వారికి బీమా ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది ఉపయోగపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

The post పవన్ భజన కావాల్సిందే.. మరీ ఇంతగానా? appeared first on Great Andhra.



Source link

Related posts

Sharmila In Bapatla: జగనన్న జనం మధ్యకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించిన షర్మిల

Oknews

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tirumala ttd cancelled vip break darshan for next three months due to summer rush ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, జగన్‌ జట్టు అధికారులపై వేటు.. జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం-massive transfers of ias officers in ap attack on jagans team ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment