దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరమని నిపుణులు చెప్తుంటారు. అయితే కొందరు నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటారు. ఇది వారి ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నిద్రపోయే భంగిమ సరిగ్గా లేకపోవడం, దిండును సరిగ్గా వాడకపోవడం కూడా సమస్యలకు దారితీస్తాయి. అయితే దిండు వాడకపోవడం ఇంకా మంచిదని సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.
మెడ, వెన్నె నొప్పి
దిండును పడుకునే ముందు తలకింద సరిగ్గా పెట్టుకున్నప్పటికీ.. నిద్రలో ఉన్నప్పుడు దానిపై నుంచి తల పక్కకు జారడం, ఒకేవైపు అధిక భారం పడేలా తలను వంకరగా తిప్పి పడుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా మెడ, వెన్ను, భుజం నొప్పులకు దారితీయవచ్చునని నిపుణులు చెప్తున్నారు. కొందరు మెత్తగా ఉంటుందని రెండు దిండ్లను వాడుతుంటారు. కానీ ఇది మరింత రిస్క్. మెడ నరాలు పట్టే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పడుకునే ముందు సరిగ్గానే పడుకున్నప్పటికీ, నిద్రలో దిండుపై తలను అటూ ఇటూ తిప్పుతూ సరైన పొజిషన్‌లో పెట్టకపోతే రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు లేదా నిద్రలేమికి కారణం కావచ్చు.
దిండు వాడకపోవడమే బెటర్
దిండు వాడటం కంటే వాడకుండా ఉండటమే మంచిదని ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మెడ, వెన్ను నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. అట్లనే శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఛాతీలో మంట, యాసిడ్ రిఫ్లెక్షన్స్, స్లీప్ అప్పియా, గురక వంటివి ఉన్నప్పుడు అవి మరింత ఇబ్బందికి కారణం అవుతాయి. అంతేకాకుండా దిండు వేసుకొని నిద్రపోయాక సరైన భంగిమలో ఉంచకపోవడం అనే ఒకే ఒక్క పొరపాటు కూడా పలు సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వర్షకాలంలో చల్లటి వెదర్ వల్ల శరీరంలో తేమశాతం కూడా తగ్గుతుందని, ఇది ఒళ్లు, మెడ నరాలు, ఎముకల్లో నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read more…
Iv beauty therapy: అందాన్ని పెంచే ఐవీ బ్యూటీ థెరపీ.. సెలబ్రిటీలు కూడా..