EntertainmentLatest News

బాబాయ్ పేరు పవన్ కళ్యాణ్ కాదు… కేకేకే అంటున్న నిహారిక!


పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు ఎపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నాగబాబు తనయ నిహారిక పవన్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను చేస్తున్న నిహారిక ఆ సినిమా ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఆ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ గురించి, బాబాయ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది.

‘బాబాయ్‌ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాడని అనుకున్నాం. రిజల్ట్స్‌ రోజు మేమంతా టీవీలకే అత్తుకుపోయి ఉన్నాం. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాం. అందరికంటే ఎక్కువగా అమ్మ ఎమోషనల్‌ అయింది. ఎందుకంటే అమ్మ బాబాయ్‌ నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారం కూడా చేసింది’ అని చెబుతూ బాబాయ్‌ తనని ఎలా చూసుకుంటాడు అనేది వివరించింది. ‘బాబాయ్‌ నన్ను ఎప్పుడూ నిహా అని పిలుస్తాడు. ఇప్పటివరకు నాపైన ఎప్పుడూ కోపం చూపించలేదు. ఆయన అభిరుచులు చాలా విభిన్నంగా ఉంటాయి. అకిరాకు నేను రాఖీ కట్టినపుడు నాకు ఓ మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటున్నాను. బాబాయ్‌ అసలు పేరేంటో మీకు తెలుసా.. కొణిదెల కళ్యాణ్‌కుమార్‌. అందుకే నా ఫోన్‌లో బాబాయ్‌ పేరును కెేకేకేగా సేవ్‌ చేసుకున్నాను’ అంటూ బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేసుకుంది నిహారిక. 



Source link

Related posts

బాలీవుడ్ బాద్‌షా ప్రభాస్.. 'కల్కి' సునామీలో ఖాన్ ల రికార్డులు ఖతం!

Oknews

tsbie inter hall tickets will be available for download from february 20

Oknews

Jharkhand Governor CP Radhakrishnan took oath as the Governor of Telangana

Oknews

Leave a Comment