సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో చేయనున్నాడు. మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగష్టు 9న ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులు మరికొంత సమయం ఎదురుచూడక తప్పదని, ఆగష్టు 9న ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉండవని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇది మహేష్ ఫ్యాన్స్ కి ఎంతో నిరాశ కలిగించే విషయం. అయితే మహేష్ కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ సంగతి అటుంచితే.. ఆయన ఓల్డ్ మూవీస్ మాత్రం బర్త్ డేకి సర్‌ప్రైజ్ చేయబోతున్నాయి. (Mahesh Babu Birthday)
టాలీవుడ్ లో కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలు సినిమాలు రీ రిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటాయి. వాటిలో మహేష్ నటించిన ‘బిజినెస్ మేన్’, ‘ఒక్కడు’, ‘పోకిరి’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రిలీజ్ సందడి మరోసారి చూడబోతున్నాం. మహేష్ కెరీర్ లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘మురారి’ ఆగష్టు 9న రీ రిలీజ్ అవుతోంది. అలాగే ఆగష్టు 8న రాత్రి పలు థియేటర్లలో ‘ఒక్కడు’ స్పెషల్ షోలు వేస్తున్నారు. ‘SSMB 29’ సినిమా అప్డేట్ రాక నిరాశ చెందే అభిమానులకు ఈ రీ రిలీజ్ లు కాస్త ఉత్సాహాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు.