ప్రభాస్ ‘కల్కి’ (Kalki) తర్వాత థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేదు. కమల్ హాసన్ ‘భారతీయుడు-2’ (Indian 2) విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర చేతులేత్తిసింది. ఇక ఈ వారం (జూలై 26) ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘రాయణ్’ (Raayan) తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. దీంతో పాటు రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, ‘ఆపరేషన్ రావణ్’ కూడా జూలై 26 నే విడుదలవుతున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఓటీటీ సినిమాలు, సిరీస్ లపై ప్రేక్షకుల దృష్టి పడింది. ఈ వారం వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి.
ఆహా:
రాజు యాదవ్ తెలుగు మూవీ – స్ట్రీమింగ్ (జూలై 24)
భరతనాట్యం తెలుగు మూవీ – జూలై 27
జీ5:
భయ్యాజీ హిందీ మూవీ – జూలై 26
డిస్నీ+హాట్ స్టార్:
చట్నీ సాంబార్ తమిళ సిరీస్ – జూలై 26
బ్లడీ ఇష్క్ హిందీ మూవీ – జూలై 26
అమెజాన్ ప్రైమ్ వీడియో:
మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 25
నెట్ ఫ్లిక్స్:
క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్) – జూలై 25
ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25
టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) – జూలై 25
ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26
ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 26
ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 26
జియో సినిమా:
విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 26