Andhra Pradesh

అమరావతి రాజధానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పనులు రీస్టార్ట్ చేసేందుకు టెక్నికల్ కమిటీ ఏర్పాటు-ap govt formed technical committee to suggest on amaravati capital works restart ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


భవనాల పటిష్టతపై అంచనాలు

మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భ‌వ‌నాల ప‌టిష్టతను టెక్నికల్ కమిటీ అంచ‌నా వేయ‌నుంది. దీనికోసం పలువురి స‌ల‌హాలు తీసుకోనుంది. రోడ్లు, డ్రైనేజీ, వాట‌ర్ స‌ప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, క‌మ్యూనికేష‌న్ ప‌నుల‌కు జ‌రిగిన న‌ష్టం అంచ‌నా వేయనుంది. రాజ‌ధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియ‌ల్ క్వాలిటీ ప‌రిశీలించనుంది. పైప్ లు, ఇనుము, ఇత‌ర మెటీరియ‌ల్ సామ‌ర్థ్యం అంచ‌నా వేయనుంది. అవ‌స‌ర‌మైన చోట తిరిగి పరికరాలు అమ‌ర్చడం, నిలిచిపోయిన అన్ని ప‌నుల‌పై ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన ప‌నులు ఎక్కడి నుంచి ప్రారంభించాల‌నే దానిపై నిర్ధిష్టమైన సూచ‌న‌లు చేయనుంది క‌మిటీ. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వ‌చ్చే క్లెయిమ్ ల‌ను అధ్యయ‌నం చేసి సిఫార్సులు చేయనుంది. కమిటీ ఏర్పాటుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.



Source link

Related posts

Students Protest: జూలై4న రాష్ట్రంలో విద్యా సంస్థ‌లు బంద్,విద్యార్థి సంఘాల పిలుపు

Oknews

నా తల్లిపై కూడా కేసు పెడతామని బెదిరించారు, కంటతడి పెట్టుకున్న లోకేశ్-vijayawada tdp meeting nara lokesh alleged cm jagan political vendetta on chandrababu family ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పాపికొండల విహారయాత్రకు బ్రేక్, గోదావరి వరద ఉద్ధృతితో బోటు ప్రయాణాలు రద్దు-east godavari papikondalu tours stalled due to heavy rains godavari floods ap govt cancelled tours ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment