పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా 2013 లో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది(attarintiki daredi)ఎన్నో రికార్డులని తన వశం చేసుకుంది. అందులో పవన్ కళ్యాణ్ మనసుని కాజేసిన భామ ప్రణీత(pranitha)అందుకే బొంగరాలాంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది. ఆమ్మో.. బాపు గారి బొమ్మో అని డ్యూయట్ కూడా పాడాడు. ఇప్పుడు ఈ బొమ్మపై కొంత మంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమకి చెందిన ప్రణీత 2021లో నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. 2022 జూన్‌లో ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ టైం లో చాలా మంది సినీ సెలబ్రిటీస్ అండ్ ఫ్యాన్స్ అభినందనలు కూడా చెప్పారు. ఇప్పుడు మరో సారి ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా విషయాన్నీ తెలియ చేసిన ప్రణీత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలని షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోల వల్లే ఆమె మీద విమర్శల దాడి జరుగుతుంది.. బేబీ బంప్ ని చూపిస్తు వేసుకున్న ప్యాంటు జిప్ ని కొంత మేర వరకు లాగింది. దీంతో ప్రెగ్నెంట్ గా ఉండి ఇలా చేస్తావా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా రౌండ్ 2 .. ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు అనే క్యాప్షన్ ని కూడా ఇచ్చింది.
ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం లాంటివి ప్రణీత కి మంచి పేరే తెచ్చిపెట్టాయి. కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పూర్తి పేరు ప్రణీత సుభాష్. సినిమాలకైతే ఇక పూర్తిగా స్వస్తి చెప్పినట్టే.