మరోసారి గర్భం దాల్చిన హీరోయిన్


ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ ప్రణీత. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి గర్భం దాల్చింది.

తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రణీత స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు ఆమె షేర్ చేసింది. రౌండ్-2 అంటూ చెప్పుకొచ్చిన ఈ హీరోయిన్, ఇకపై ఈ ప్యాంట్లు తనకు సరిపోవంటూ క్యాప్షన్ పెట్టింది.

కరోనా టైమ్ లో గుంభనంగా పెళ్లి చేసుకుంది ప్రణీత. బెంగళూరుకు చెందిన బిజినెస్ మేన్ నితిన్ ను 2021లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రణీత. ఆ తర్వాత పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. 31 ఏళ్ల ఈ బ్యూటీ, ఓవైపు ఇలా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు మలయాళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది.

The post మరోసారి గర్భం దాల్చిన హీరోయిన్ appeared first on Great Andhra.



Source link

Leave a Comment