ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలాగో బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. తాజాగా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినప్పటికీ తన సినిమాలు ఆపలేదు.
పదేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా ఎంచక్కా తన సినిమాల్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, బాలయ్య మాత్రం తన కొత్త సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లారు.
అలా అని ఆయన రాజకీయాలకు దూరంగా జరగరు. కొన్ని రోజులు షూటింగ్ చేస్తారు, ఆ వెంటనే రాజకీయాల్లో మునిగిపోతారు. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతిరోజూ రాజకీయం అంటూ ఉండరు.
సరిగ్గా ఇదే మైండ్ సెట్ ను పవన్ కల్యాణ్ కూడా అలవర్చుకోవాలంటున్నారు అతడి ఫ్యాన్స్. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్యే, సీరియస్ గా సినిమాలు చేస్తుంటే, పవన్ ఎందుకు తన సినిమాల్ని పక్కనపెడుతున్నారనేది ఫ్యాన్స్ ఆవేదన.
నిజమే.. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ఉప-ముఖ్యమంత్రే. పైగా పోర్టుపోలియోలు కూడా చాలానే ఉన్నాయి చాలా బాధ్యతలున్నాయి. అలా అని సినిమాల్ని విస్మరిస్తే ఎలా?
కొత్త సినిమాలు ప్రకటించనక్కర్లేదు. ఒప్పుకున్న సినిమాలైనా పూర్తిచేయాలి కదా. దర్శకనిర్మాతల్ని అలా వెయిటింగ్ లిస్ట్ లో పెడితే ఎలా? రీసెంట్ గా పవన్ కాల్షీట్లపై చిన్నపాటి చర్చ జరిగింది. ఆ చర్చలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా బయటకురాలేదు.
The post బాలకృష్ణలా పవన్ చేయొచ్చు కదా? appeared first on Great Andhra.