EntertainmentLatest News

చిరు, చరణ్ మీద  చైతన్య రెడ్డి కామెంట్స్ నిజమయ్యేనా.. ఆ దర్శకుడి కసి తీరేనా!


పాన్ ఇండియా లెవల్లో  హనుమాన్(hanuman)మూవీ సాధించిన ఘన విజయం అందరికి  తెలిసిందే.  దీంతో హనుమాన్ సీక్వెల్  జై హనుమాన్(jai hanuman)మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ(prasanth varma)అయితే  ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా  అవతరించాడు. దీంతో జై హనుమాన్ తో తన స్థాయిని మరింతగా పెంచుకోవాలనే  దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఇక హనుమాన్  క్లైమాక్స్ సీన్ ని బట్టి జై హనుమాన్ ఎక్కువ భాగం హనుమంతుడి మీద నడవనుంది. ఇప్పుడు ఈ  విషయంలో ప్రశాంత్ వర్మ వేసుకున్న ప్లాన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. 

 జై హనుమాన్ స్క్రిప్ట్ ని ప్రశాంత్ ఏ విధంగా రాసుకున్నాడో తెలియదు గాని, అంజనీ పుత్రుడు చేసే విన్యాసాలని వర్తమానానికి ముడిపెడుతు  తెరకెక్కించబోతున్నాడనే  ప్రచారం అయితే ఎప్పటినుంచో ఉంది. ఇందు కోసం భారీ బడ్జట్ ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ  బడ్జెట్ కి న్యాయం చెయ్యడం కోసం  చిరంజీవి(chiranjeevi)ని రంగంలోకి దించాలని ప్రశాంత్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చిరు ని ఎలాగైనా సరే  ఒప్పించి హనుమంతుడి పాత్ర వేయించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది. పైగా యూనిట్ మొత్తం కూడా చిరంజీవి పర్ఫెక్ట్ అనే అభిప్రాయంతో ఉన్నారంట. వాళ్ళ ఆలోచన మంచిదే. పైగా ప్రేక్షకులకి  చిరు అభిమానులకి, హనుమాన్ అభిమానులకి అంత కంటే కావలసింది ఏముంటుంది. దీంతో చాలా మంది  ప్రశాంత్ ప్లాన్ చాలా బాగుందని,  చిరు తో  ఓకే చెప్పించి అధికార ప్రకటన ఇవ్వమని కూడా అంటున్నారు.ఎందుకంటే హనుమాన్ చిరు  ఇంటి దైవం.దీంతో చిరు జై హనుమాన్ ని చేస్తాడని అంటున్నారు. 

 

గతంలో  జగదేకవీరుడు అతిలోకసుందరిలో హనుమంతుడి గెటప్ లో కొన్ని నిమిషాల పాటు కనిపించిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.చిరు ప్రెజంట్ అయితే   విశ్వంభర(vishwambhara)తో బిజీగా ఉన్నాడు. ఇది నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత గాడ్ ఫాదర్ డైరెక్టర్ మూవీలో చేయబోతున్నాడు. ఈ మేరకు అధికార ప్రకటన కుడా వచ్చింది. మరి ప్రశాంత్ ప్లాన్ వర్క్ అవుట్ అయినా కూడా లేట్ గా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.ఇంకో ఆసక్తి కారణమైన విషయం ఏంటంటే హనుమాన్ నిర్మాతలో ఒకరైన   చైతన్య రెడ్డి  ఇటీవల జరిగిన  డార్లింగ్ ప్రమోషన్స్ లో  మాట్లాడుతూ హనుమంతుడు అంటే చిరంజీవి లేదా రామ్ చరణ్(ram charan)ని ఊహించుకుంటున్నామని చెప్పింది.ఏది ఏమైనా  చిరు  జై హనుమాన్ చేస్తే  పాన్ ఇండియా లెవల్లో రికార్డులు సృష్టించడం ఖాయం.

 



Source link

Related posts

గీతా ఆర్ట్స్ లో బోయపాటి మూవీ.. హీరో అల్లు అర్జున్ కాదు..!

Oknews

kamma-rajyamlo-kadapa-reddlu-trailer-2 – Telugu Shortheadlines

Oknews

Fake RPF SI Malavika Arrested | Fake RPF SI Malavika Arrested | పెళ్లి చూపుల్లో అడ్డంగా బుక్కైన నకిలీ మహిళ ఎస్సై

Oknews

Leave a Comment