EntertainmentLatest News

‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ


సినిమా పేరు: పురుషోత్తముడు

తారాగణం: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: పీజీ విందా

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

రచన, దర్శకత్వం: రామ్‌ భీమన

నిర్మాత: రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్

బ్యానర్: శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్

విడుదల తేదీ: జూలై 26, 2024

‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తో హీరోగా కెరీర్ ని స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్.. ఆ తరువాత వరుస సినిమాలతో నిరాశపరిచాడు. ఒకట్రెండు మినహా దాదాపు సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఓ మంచి హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు ‘పురుషోత్తముడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ కి హిట్ ఇచ్చేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఇండియాలోని బడా వ్యాపారవేత్త ఆదిత్య రామ్(మురళి శర్మ) కుమారుడు రచిత్ రామ్(రాజ్ తరుణ్) లండన్ లో చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగొస్తాడు. వచ్చీ రాగానే రచిత్ ని తన కంపెనీకి సీఈఓ చేయాలని ఆదిత్య రామ్ భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం సీఈఓ కావాలంటే.. వంద రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని.. రచిత్ పెద్దమ్మ వసుంధర(రమ్యకృష్ణ) గుర్తు చేస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే గ్రామానికి చేరుకుంటాడు రచిత్. అక్కడ అమ్ము(హాసిని సుధీర్) తో ప్రేమలో పడతాడు. అలాగే ఆ ప్రాంత ఎమ్మెల్యే కుటుంబం కారణంగా ఇబ్బంది పడుతున్న స్థానిక రైతుల తరపున పోరాటానికి దిగుతాడు. మరోవైపు అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న రచిత్ వివరాలను బయటపెట్టి అతన్ని సీఈఓ కాకుండా అడ్డుకోవాలని.. తన కుమారుడితో కలిసి రచిత్ పెద్దమ్మ వసుంధర కుట్రలు పన్నుతుంది. మరి రచిత్ సీఈఓ అయ్యాడా? రైతుల కోసం అతను ఏం చేశాడు? అతని ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

వందల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి.. అజ్ఞాత జీవితం గడపటం అనే పాయింట్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. పిల్లజమీందార్, శ్రీమంతుడు, బిచ్చగాడు వంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. పురుషోత్తముడు కూడా అదే తరహా పాయింట్ తో రూపొందింది. ఇది అందరికి బాగా తెలిసిన కథ. ఇలాంటి కథలను ఎంచుకున్నప్పుడు.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను బోర్ బొట్టకుండా రైటింగ్ తో మ్యాజిక్ చేయాలి. కానీ అలాంటి మ్యాజిక్ పురుషోత్తముడులో ఎక్కడా కనిపించదు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ప్రేమ సన్నివేశాలు, రైతుల ఎపిసోడ్ తో ఫస్ట్ హాఫ్ కొంతవరకు పరవాలేదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కథలో బలమైన సంఘర్షణ కనిపించదు. విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా లేదు. ఎలివేషన్, యాక్షన్ సన్నివేశాలు మెప్పించాయి కానీ.. రాజ్ తరుణ్ ఇమేజ్ ను మించి ఉన్నాయి. చాలా సీన్స్ సినిమాటిక్ గా ఉన్నాయి. పతాక సన్నివేశాలు పరవాలేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

రచిత్ రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్ అందంగా ఉంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటీనటులు వారి వారి పాత్రలను తేలికగా చేసుకుంటూ పోయారు. 

దర్శకుడు రామ్‌ భీమన ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కథనం ఆకట్టుకునేలా లేదు. పీజీ విందా సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్ సంగీతం ఆకట్టుకున్నాయి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన అనుభవంతో ఉన్నంతలో సినిమాని నీట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా…

పిల్లజమీందార్, శ్రీమంతుడు, బిచ్చగాడు సినిమాలను గుర్తుచేసేలా ఉన్న ‘పురుషోత్తముడు’ పెద్దగా మెప్పించలేకపోయింది.



Source link

Related posts

Unexpected ideas of Kalki makers ఊహకందని కల్కి మేకర్స్ ఆలోచనలు

Oknews

కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ.. ఇప్పుడు తెలుగులో!

Oknews

సురేష్ రైనా చెన్నై లో కలవబోయేది ఈ హీరోనే 

Oknews

Leave a Comment